పబ్లిసిటీ వస్తుందంటే చంద్రబాబు 5 లక్షలిస్తాడు, నా భయమే!: జగన్

అనంతపురం: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్రను మంగళవారం చేపట్టారు. బుధవారం యాత్ర కొనసాగుతోంది.

ఉదయం ఆయన కళ్యాణదుర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి భూమిపూజ నిర్వహించారు. అనంతరం భరోసా యాత్రను ప్రారంభించారు.

నేరుగా బ్రహ్మ సముద్రం మండలం పొబ్బర్లపల్లికి చేరుకున్నారు. ఆ తర్వాత ముదిగల్లు చేరుకొని అక్కడి నుండి బోయనారాయణప్ప కుటుంబాన్ని పరామర్శిస్తారు. వర్ణిలో గంగన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు.

వైయస్ జగన్ భరోసా యాత్ర

వైయస్ జగన్ భరోసా యాత్ర

మంగళవారం నాడు రైతు భరోసా యాత్రలో జగన్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన నిప్పులు చెరిగారు. ప్రచారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడన్నారు. పుష్కరాల ప్రమాద ఘటన అలాగే జరిగిందని ఆరోపించారు.

వైయస్ జగన్ భరోసా యాత్ర

వైయస్ జగన్ భరోసా యాత్ర

చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు, మాట్లాడేది అంతా మోసమే అన్నారు. పబ్లిసిటీ వస్తుందంటే రూ.5 లక్షల పరిహారం ఇస్తానంటారని ఆరోపించారు. లేదంటే రైతుల ఆత్మహత్యలే జరగలేదంటారన్నారు.

వైయస్ జగన్ భరోసా యాత్ర

వైయస్ జగన్ భరోసా యాత్ర

జగన్ వస్తున్నారంటే హడావుడిగా పరిహారం ప్రకటిస్తాడని, లేదంట ఇవ్వడని అన్నారు. ప్రచారం కోసం పుష్కరాల్లో షార్ట్ ఫిల్మ్ తీసి 27 మందిని బలి తీసుకున్నాడని ఆరోపించారు.

వైయస్ జగన్ భరోసా యాత్ర

వైయస్ జగన్ భరోసా యాత్ర

రైతులు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల ముందు చెప్పారని, అపరాధ వడ్డీ కూడా సరిపోని విధంగా రుణమాఫీ వర్తింప చేశారన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చేలా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సి ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+