పథకాల కొనసాగింపు, ముగింపు పై జగన్ కీలక వ్యాఖ్యలు...!!
ఏపీలో ఎన్నికల కీలక దశకు చేరుకున్నాయి. పార్టీల అధినేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. సీఎం జగన్ ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. నవరత్నాల కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ల పెంపుదల ఉంటుందని చెప్పారు. ఇటు టీడీపీ కూటమి పార్టీలు ఈ నెల 30న ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్నాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఏపీలో అమలవుతున్న పథకాల కొనసాగింపు, ముగింపు పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
ముఖ్యమంత్రి జగన్ తాడిపత్రి నుంచి తన మలి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అయిదేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమం గురించి వివరించారు. పథకాలు కొనసాగాలంటే జగన్ కు ఓటు వేయాలని కోరారు. చంద్రబాబుకు ఓటు వేయటం అంటే పథకాలు ముగింపుకు ఆమోదం తెలిపినట్లేనని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించేవే కాదని..వచ్చే అయిదేళ్ల భవిష్యత్ ను నిర్ణయించేవని పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మటం అంటే పులి నోట్ల తల పెట్టినట్టేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సాధ్యం కాని హామీలిస్తున్నారని చెప్పారు. 2019 లో ఇచ్చిన మేనిఫెస్టో 99 శాతం అమలు చేసి మరోసారి ప్రజల ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు.

అయిదేళ్ల కాలంలో 2.70 లక్షలు పేదల ఖాతాల్లో అనేక పథకాల ద్వారా అందించామని జగన్ వివరించారు. 58 నెలల కాలంలో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. పౌర సేవల్లో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. ప్రజల ముంగిటకు పాలన తెచ్చేందుకు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చామన్నారు. ప్రతీ రైతులోనూ సచివాలయంలో, రైతు భరోసా కేంద్రం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. నాడు - నేడు ద్వారా స్కూళ్లు, ఆస్పత్రుల రూపు రేఖలు మారుస్తున్నామని వివరించారు. చట్టం చేసి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసినామినేటెడ్ పదవులు ఇచ్చామనిజగన్ చెప్పుకొచ్చారు. రుణమాఫీ అంటూ చంద్రబాబు మోసం చేసారని..గతంలో ఈ మూడు పార్టీలు కలిసి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని జగన్ గుర్తు చేసారు.












Click it and Unblock the Notifications