మీరేం విలన్‌కాదు!: బిజెపి నేత, సీఎం సార్.. మగాడివా అని బెదిరించారు: జగన్
హైదరాబాద్: ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతి నాయకుడు (విలన్) కాదని బిజెపి నేత, మంత్రి మాణిక్యాల రావు బుధవారం నాడు శాసన సభలో వైసిపి అధినేత జగన్‌ను ఉద్దేశించి అన్నారు. ఏపీ అభివృద్ధిపై కేంద్రం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. విశాఖకు రైల్వే జోన్ వస్తుందన్నారు.
టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రయోజనాల కోసం అయినా జగన్ తీర్మానానికి మద్దతు ప్రకటించాలన్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.
కేంద్ర నుంచి ఆశించినంతగా సాయం అందడం లేదన్నది మాత్రం వాస్తమేనన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలో రాష్ట్రానికి కాస్త నిరాశే మిగిలిందని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం సాయం చేస్తున్నా అది ఏమాత్రం సరిపోవడం లేదని చెప్పారు.
విభజన చట్టం హామీలు అమలు చేయాలన్న తీర్మానానికి తాము మద్దతిస్తున్నామని వైసిపి అధినేత జగన్ చెప్పారు. అదే సమయంలో గతంలో చేసిన తీర్మానం ఏమయిందని జగన్ ప్రశ్నించారు. అంతకుముందు చంద్రబాబు మాట్లాడుతూ.. కొంతమంది తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఎక్కడకు వెళ్లినా రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆలోచిస్తా: చంద్రబాబు
ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా తాను రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆలోచిస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీకి కేంద్రం సాయం కోసం తాము తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము 10.99 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు.
మనకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఆదాయం తక్కువగా ఉందన్నారు. 2018 కల్లా పోలవరం పూర్తి చేయాల్సిన అవసరముందన్నారు. అవసరమైతే పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మనకు అంతర్రాష్ట్ర సమస్యలు కూడా ఉన్నాయన్నారు. అనంతరం సభ వాయిదా పడింది.

చంద్రబాబు సార్ అనాలేమో, అప్పుడు తప్పనిపించలేదా: జగన్
రాచరిక వ్యవస్థలో ఉన్నామని చంద్రబాబు అనుకుంటున్నట్లుగా ఉందని జగన్ ఎద్దేవా చేశారు. టిడిపికి, మాకు కేవలం 1.8 శాతం ఓట్లు మాత్రమే తేడా అనే విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. తాను సభలో ఏం తప్పుగా మాట్లాడలేదన్నారు. వాస్తవ పరిస్థితులను వివరించానని చెప్పారు.
తాను సభలో బీద అరుపులు అరుస్తారని చెప్పిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు భూతద్దంలో చూస్తున్నారన్నారు. గతంలో ముఖ్యమంత్రి, మంత్రులు తమ సభ్యులను బెదిరించిన సందర్భాలు ఉన్నాయన్నారు. నువ్వు మగాడివా, అంతు చూస్తామని వేలెత్తి బెదిరించారన్నారు.
అప్పుడు సభాపతి కోడెల శివప్రసాద రావుకు తప్పుగా అనిపించలేదా అని ప్రశ్నించారు. నేను సభలో ముఖ్యమంత్రిగారు అంటే తప్పు అనిపిస్తోందా అన్నారు. సీ ఎం సార్ అనాలా అని ఎద్దేవా చేశారు. వైయస్ హయాంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే ఘనత తనదేనని చంద్రబాబు చెప్పుకుంటున్నారన్నారు. మనం రాచరిక వ్యవస్థలో ఉన్నామని బాబు అనుకుంటున్నట్లుగా ఉందన్నారు.
చంద్రబాబు ప్రభుత్వానికి సోము వీర్రాజు సలహా
ఏపీ ప్రభుత్వానికి బిజెపి నేత సోము వీర్రాజు సలహా ఇచ్చారు. కేంద్రం నిధులను చంద్రన్న బాట, నీరు - చెట్టుకు వాడుకుంటున్నారని వీర్రాజు అన్నారు. అయితే, వాటిని రాయలసీమ కరువు నివారణకు ఎందుకు వాడటం లేదని ప్రశ్నించారు. కేంద్రం నిధులను మళ్లించి రాయలసీమ కరువును పారద్రోలాలన్నారు.
బాబు చిత్తసుద్దిపై అనుమాలున్నా ప్రయోజనాల కోసం తీర్మానానికి మద్దతు, కోటంరెడ్డి, కాల పరిమితతే కేంద్రానికి హెచ్చరిక చేసి ఉంటే బాగుండేది, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనలా కోసం రాష్ట్రాన్ని ప్రభుతవం తాకట్టు పెడితే చూస్తూ ఉరుకోం,
చంద్రబాబు చిత్తశుద్ధిపై అనుమానాలున్నా: కోటంరెడ్డి
విభజన హామీల విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధి పైన అనుమానాలున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం తీర్మానానికి మద్దతు పలికామని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సభ వాయిదా అనంతరం వైసిపి సభ్యులు మీడియా పాయింటు వద్ద మాట్లాడారు.
కాలపరిమితితో కేంద్రానికి హెచ్చరిక చేసి ఉంటే బాగుండేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ప్రభుత్వం తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోమన్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. అడుక్కుంటే విభజన హామీలు నెరవేరవన్నారు.












Click it and Unblock the Notifications