కేసీఆర్ ప్రభుత్వంపై జగన్ అసంతృప్తి, బాబు చూడాలని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎన్జీవోల భూములను వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై జగన్ ఘాటుగా స్పందించారు.
ఏపీఎన్జీవోలకు కేటాయించిన 189 ఎకరాల భూమని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పైన తాను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. తక్షణమే ఆ భూములను ఏపీఎన్జీవోలకు ఇవ్వాలన్నారు. ఆ భూముల కేటాయింపు రెండు దశాబ్దాల క్రితం జరిగిందన్నారు.

ఆ భూమిని ప్రభుత్వ ఉద్యోగులు ప్లాట్లుగా విభజించుకున్నారని, రోడ్లు, ఇతర సౌకర్యాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి భూములు వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీఎన్జీవోలకు ఆ భూములను రద్దు చేయడం సమంజసం కాదన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేరెవరికైనా భూములు కేటాయించాలనుకుంటే ప్రత్యామ్నాయం కోసం చూడాలి తప్పితే ఏపీఎన్జీవోల భూములు తీసుకోవడం సరికాదన్నారు. వారి భూములు వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే ఏపీ ప్రభుత్వం కలుగ చేసుకొని ఏపీఎన్జీవోలకు న్యాయం చేయాలన్నారు. వారికి అండగా నిలబడాలన్నారు. ఏపీఎన్జీవోలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
కోర్టులో ఉన్నందునే: అశోక్ బాబు
ఏపీఎన్జీవోల భూమి కేసు కోర్టులో ఉన్నందున తాము ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని ఏపీఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు వేరుగా చెప్పారు. ఏపీఎన్జీవోలకు ఇచ్చిన 189 ఎకరాల భూముల్లో వంద ఎకరాలు వివాదంలో ఉందన్నారు. టైటిల్ క్లియరెన్స్ లేదన్నారు. తాము త్వరలో ఏపీ సిఎం కేసీఆర్‌ను కలుస్తామని, తమ భూములు తమకే ఇవ్వాలని కోరుతామన్నారు. 2010లో లాటరీ పద్ధతిలో 1644 మందికి ప్లాట్లు కేటాయించినట్లు చెప్పారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications