కృష్ణా జిల్లాల్లో మొదలైన జగనన్న పాలవెల్లువ- అమూల్ తో లాభాలివే-గేమ్ ఛేంజర్ అన్న జగన్
ఏపీలో సహకార పాల ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన జగనన్న పాల వెల్లువ పథకం ఆరో జిల్లాలోకి ప్రవేశించింది. ఇప్పటికే ఐదు జిల్లాల్లో ఈ పథకం అమలవుతుండగా.. ఇవాళ కృష్ణాజిల్లాలో సీఎం జగన్ ప్రారంభించారు.
జిల్లాలోని 264 గ్రామాల్లో ఈ పథకం అమలును క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో జగన్ ప్రారంభించారు.
గుజరాత్ కు చెందిన సహకార దిగ్గజం అమూల్ సాయంతో పాడి రైతులకు మేలు చేసేందుకే ఈ పథకం అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.

కృష్ణాజిల్లాలో జగనన్న పాల వెల్లువ
రాష్ట్రంలో పాల సేకరణ కోసం వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న పాల వెల్లువ పథకం వరుసగా ఆరో జిల్లాలో విజయవంతంగా ప్రవేశించింది. ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, కడప, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఈ పథకం అమలవుతుండగా.. ఇవాళ ఆరో జిల్లాగా కృష్ణాజిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా జిల్లాలోని 264 గ్రామాల్లో ప్రభుత్వం తరఫున అమూల్ పాలసేకరణ జరపనుంది. ఇందుకోసం పాడి రైతులతో ఒప్పందాలు చేసుకుంటారు. సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి దీనికి వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవం చేశారు.

త్వరలో మరో ఏడు జిల్లాల్లో
ఏపీలో ఇవాళ ప్రారంభమైన కృష్ణాజిల్లాతో కలుపుకుని ఆరు జిల్లాల్లో జగనన్న పాల వెల్లువ పథకం అమలవుతుండగా.. మిగిలిన ఏడు జిల్లాల్లోనూ త్వరలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని సీఎం జగన్ ఇవాళ ప్రకటించారు. కృష్ణాజిల్లాలో పథకం ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా రైతులకు ఏయే ప్రయోజనాలు చేకూరుతున్నాయో ఆయన వివరించారు. సహకార పాల ఉత్పత్తి దిగ్గజంగా పేరున్న అమూల్ రాకతో పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

రాష్ట్రంలో జరగుతోంది ఇదే
పాలు కొనేవారు ఒక్కరే ఉండి అమ్మేవాళ్లు ఎక్కువ మంది ఉంటే అప్పుడు కొనేవాళ్లు ఎంత చెప్తే అంతకు అమ్మాల్సిన పరిస్ధితి ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. కొనేవాళ్లు ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నా సరే కొనే వాళ్లంతా కట్టకట్టుకుని ఇంత రేటుకే కొంటాం, ఇంతకన్నా ఎక్కువ కొనబోమనే పరిస్ధితి ఉన్నా అన్యాయమే జరుగుతుందన్నారు. ఇలాంటి మార్కెట్‌ను మన రాష్ట్రంలో చూస్తున్నామని జగన్ తెలిపారు. ఈ రెండు పరిస్థితుల్లో ఎవరు ఉన్నా.. ఉత్పత్తి చేసేవారికి అన్యాయం జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుందని తెలిపారు. ఇవ్వాళ్టి నుంచి కృష్ణా జిల్లాల్లో రైతులకు అక్కచెల్లెమ్మలకు మరింత మంచి ధర లభించనుందని జగన్ తెలిపారు.

గేమ్ ఛేంజర్ గా జగనన్న పాల వెల్లువ
ధరలస్థిరీకరణతో ప్రభుత్వం మార్కెట్లోకి ప్రవేశించి... రైతులకు మంచి ధరలు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని సీఎం జగన్ తెలిపారు. దీనివల్ల వ్యాపారులు కూడా మంచి ధరలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నిర్ణయించిన ధరకు లేక అంతకన్నా.. ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చిందన్నారు. ధరల స్థిరీకరణ నిధిద్వారా రైతులకు తోడుగా నిలవగలిగామని, ఇలాంటి వాటికి మాత్రమే కాకుండా అక్కచెల్లెమ్మలకు ఎలా న్యాయం చేయాలన్న ఆలోచనతో అధికారంలోకి రాగానే ఆ దిశగా అడుగులు వేశామన్నారు. అమూల్‌తో మాట్లాడి... వారిని రాష్ట్రానికి తెచ్చామని, అమూల్‌అనేది కంపెనీ కాదు.. సహకార సంస్థ, దానికి రైతులే యజమానులని జగన్ తెలిపారు. అమూల్ దగ్గర మంచి ప్రాససింగ్ యూనిట్లు ఉన్నాయిని, వచ్చే లాభాలను పాడిరైతులకే తిరిగి ఇస్తారని జగన్ వెల్లడించారు. అమూల్ లాభాపేక్ష లేని సంస్థ అని, దీని ద్వారా చేపడుతున్న పాల సేకరణవల్ల రైతులకు అదనంగా రూ.10 కోట్ల రూపాయల మేలు జరిగిందన్నారు. రైతులకు అదనంగా లీటర్‌కు రూ.20ల పైచిలుకు లాభం వచ్చిందన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆర్థిక చైతన్యానికి ఈ పాలవెల్లువ కార్యక్రమం ఊతమిస్తోందన్నారు. ఒక లీటరు మినరల్ వాటర్ ధర ఎంతో, లీటరు పాల ధరకూడా అంతే ఉందని చాలామంది రైతులు తనకు పాదయాత్రలో చెప్పారని, ప్రతి జిల్లాలో ఈ మాటలు చెప్పేవారని జగన్ గుర్తు చేసుకున్నారు. అందుకే అమూల్‌సంస్థతో కలిసి పాలవెల్లు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

అమూల్ వల్ల లాభాలివే
దేశంలోనే పాల ప్రాసెసింగ్‌లో అమూల్ నంబర్ 1 సంస్థ అని జగన్ అన్నారు. ఇది ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉందన్నారు.
పాల బిల్లులను కూడా 10 రోజుల్లోనే పాడిరైతుల ఖాతాల్లోకి జమచేస్తున్నారని గుర్తుచేశారు. ఆర్థికంగా అక్కచెల్లెమ్మలకు మరింత మంచి జరుగుతుందన్నారు. అమూల్ సహకార రంగ సంస్థ, సహకార రంగ వ్యవస్థ బాగుంటే రైతులు బాగుంటారని జగన్ తెలిపారు. ఏడాదిలో కనీసం 182 రోజులు పాలుపోసే మహిళా రైతులకు ఏడాది చివర్లో ప్రతి లీటర్‌పై 50 పైసలు బోనస్‌గా చెల్లిస్తున్నారని జగన్ తెలిపారు. నాణ్యమైన దాణాను కూడా తక్కువ ధరకే సరఫరా చేస్తున్నారన్నారు. సహకార రంగ డెయిరీల్లో బాగా ఉండే డెయిరీలు ఇప్పుడు రాష్ట్రంలో ప్రైవేటు సంస్థలుగా మారిపోయాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రభావం వల్ల ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయని, ప్రభుత్వాల్లోని వ్యక్తులకు ప్రైవేటు డెయిరీలు ఉండడం వల్ల, వాటాలు ఉండడం వల్ల అక్కచెల్లెమ్మలకు మంచిచేయాలనే తపన ఉండేది కాదన్నారు. దీన్ని మార్చాలనే ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నామని గుర్తుచేశారు. పాడి ఎక్కడువగా ఉన్న గ్రామాలను ప్రభుత్వం గుర్తించిందని, ఆయా గ్రామాల్లో బీఎంసీ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనుబంధ గ్రామాల్లో కూడా ఏంసీలనుకూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తాము పోసే పాలలో ఫాట్ ఎంత? ఎస్‌ఎన్‌ఎఫ్ ఎంత? అనేది అక్కడికక్కడే రశీదు తీసుకుంటారని, ఎక్కడా కూడా మోసానికి తావులేకుండా పారదర్శకంగా పాలసేకరణ ఉంటోందన్నారు. ఈ తేడా కనిపిస్తోంది కాబట్టే.. మంచి ధరలు లభిస్తున్నాయని జగన్ గుర్తుచేశారు. అమూల్‌ను ఎదుర్కోవడానికి మిగిలిన డెయిరీలు కూడా రేట్లు పెంచుతున్నాయన్నారు. ఇది మంచి పరిణామం అన్నారు. కారణం ఏదైనా పాడిరైతులకు మేలు జరుగుతుందని జగన్ వివరించారు.
-
ఏపీలో మహిళలకు దక్కే నియోజకవర్గాలు లిస్టు ఇదే, కీలక మంత్రుల స్థానాలు సైతం..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications