జగన్ డిజిటల్ బుక్ లాంఛ్, ఎన్నికలకు సిద్దం - ఇక పోరాటమే..!!
మాజీ సీఎం జగన్ కీలక ప్రకటన చేసారు. పార్టీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఆవిష్కరించారు. రెడ్ బుక్ పేరుతో వైసీపీ కేడర్ ను వేధిస్తున్నారని.. వీరికి అండగా నిలిచేందుకు డిజిటల్ బుక్ తీసుకొస్తున్నట్లు జగన్ వెల్లడించారు. వేధింపులు.. అన్యాయానికి గురవుతున్న వారు ఫిర్యాదు చేసేందుకు క్యూ ఆర్ కోడ్ తో పాటుగా ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ కేటాయించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాల పైన ప్రజా పోరాటాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. తాను ఇక పోరుబాటలో పాల్గొంటానని.. ప్రజల్లోనే ఉంటానని జగన్ వెల్లడించారు.
డిజిటల్ బుక్ లాంఛ్
పార్టీ నేతల భేటీలో జగన్ కీలక అంశాలను ప్రస్తావించారు. అయిదేళ్ల కాలంలో వైసీపీ చేసిన అప్పు కూటమి ప్రభుత్వం 16 నెలలోనే చేసిందని చెప్పారు. వైసీపీ హయాంలో చేసిన బడులు, ఆస్పత్రుల నాడు నేడు కూటమి నేతలు గాలికి వదిలేసారని చెప్పుకొచ్చారు. ఏ ఎన్నికలు వచ్చినా కేడర్.. నేతలు సిద్దంగా ఉండాలని జగన్ నిర్దేశించారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ మోసాల ను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. ప్రభుత్వం చేయకూడని పనులు అన్నీ చేస్తుందని జగన్ వ్యాఖ్యానించారు. ఇసుక దోచుకుంటున్నారని జగన్ విమర్శించారు. బెల్టు షాపుల పేరుతో ప్రతీ గ్రామంలో వేలం ద్వారా కేటాయింపులు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యా రంగాన్ని తమ మద్దతు దారుల కార్పోరేట్ విద్యా సంస్థలకు అప్పగిస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు.

వదిలేదు లేదు
పార్టీలోని అన్ని కమిటీలను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జగన్ నిర్దేశించారు. అమరావతికి లక్ష కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు.. మెడికల్ కాలేజీలకు అయిదు వేల కోట్లు ఖర్చు చేయలేరా అంటూ జగన్ నిలదీసారు. సంపద సృష్టిస్తానని చెప్పి.. సంపద దోచేస్తున్నారని మండిపడ్డారు. డిజిటల్ బుక్ ఆవిష్కరించిన జగన్.. ఇక నుంచి పార్టీ కార్యకర్తలు ఎవరు ఇబ్బంది పడుతున్నా దీని ద్వారా పార్టీ నాయకత్వానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. రెడ్ బుక్ ద్వారా వైసీపీ శ్రేణులను వేధించిన వారిని వదిలేని లేదని జగన్ తేల్చి చెప్పారు. రిటైర్ అయిన వారిని వదలేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పామని జగన్ గుర్తు చేసారు. కార్యకర్తలను వేధించిన వారిని వదిలేది లేదని జగన్ మరోసారి స్పష్టం చేసారు.
ఇక ప్రజల్లోనే
16 నెలల కూటమి ప్రభుత్వ వైఫల్యాల పై పోరాటాలకు సిద్దం కావాలని జగన్ పిలుపునిచ్చారు. ఎవరిపైన అక్రమ కేసులు పెట్టి వేధించినా పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు. కూటమి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. మెడికల్ కాలేజీలపై ఉద్యమించాలని జగన్ నిర్దేశించారు. అదే విధంగా యూరియా కొరత పై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏనాడు యూరియా కొరత రాలేదని గుర్తు చేసారు. డిసెంబర్ 15 నాటికి అన్ని కమిటీల నియామకం పూర్తి చేయాలని స్పష్టం చేసారు. తాను ఇక నిరసనల్లో పాల్గొంటానని జగన్ కీలక ప్రకటించారు.












Click it and Unblock the Notifications