• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ను ముఖ్యమంత్రిని చేసింది - ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది : పొలిటికల్ రికార్డు..!!

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర రాజకీయాల్లో అదో సంచలనం. ఒక వ్యక్తితో మొదలైన పార్టీ నేడు అధికారంలో కొనసాగుతోంది. ఒక వ్యక్తి వేసిన అడుగులు సరి కొత్త ప్రజా తీర్పుకు కారణమైంది. ఆ వ్యక్తే సీఎం జగన్. విపక్ష నేతగా వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర అధికారం అందించింది. సరిగ్గా అయిదేళ్ల క్రితం ఇదే రోజున 2017, నవంబర్ 6న ఇడుపుల పాయ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. తన తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించి పాదయాత్ర ప్రారంభించారు. మొత్తం 341 రోజులు యాత్ర కొనసాగింది. 13 జిల్లాల్లోనూ యాత్ర నిర్వహించారు. రెండు కోట్ల మంది ప్రజలతో మమేకం అయ్యారు.

 నేను విన్నాను ..నేను ఉన్నాను

నేను విన్నాను ..నేను ఉన్నాను


134 నియోజకవర్గాల్లో జగన్ యాత్ర కొనసాగింది. 231 మండలాలు.. 2516 గ్రామాల మీదుగా జగన్ ప్రజలను కలుస్తూ తన యాత్ర నిర్వహించారు. 54 మున్సిపాల్టీల్లో ప్రజలతో మమేకం అయ్యారు. 8 కార్పోరేషన్లలోనూ జగన్ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగింది. జగన్ మొత్తంగా 3648 కిలో మీటర్ల పాద యాత్రలో 124 సభలు - సమావేశాలు నిర్వహించారు. 55 ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసారు. జనవరి 9, 2019 ఇచ్ఛాపురంలో జగన్ పాదయాత్ర ముగిసింది. ఆ సమయంలో ప్రతికూల వాతావరణంలోనూ సడలనీయక పాదయాత్ర సాగిస్తూ, జనం మధ్యే అడుగు మొదలుపెట్టి.. జనం మధ్యే వైయ‌స్ జగన్‌ విడిదిచేశారు. ప్రజల సమస్యలను తెలుసుకొనే ప్రయత్నం చేసారు. వారి సమస్యలను తాను అధికారంలోకి వస్తే పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు.

 నవరత్నాలు - సంక్షేమ పథకాలకు వేదికగా

నవరత్నాలు - సంక్షేమ పథకాలకు వేదికగా


తన ప్రజా సంకల్ప యాత్ర సమయంలో నవ రత్నాలను ప్రకటించారు. తన మేనిఫెస్టో ఏంటో వెల్లడించారు. సచివాలయ వ్యవస్థ గురించి వివరించారు. ఈ పాదయాత్రలోనే అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, మహిళా సాధికత, విద్యా దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం వంటివి ప్రాణం పోసుకున్నాయి. తాను అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం.. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత గురించి వివరించారు. ఆ పాదయాత్ర పూర్తయిన వెంటనే అభ్యర్ధులను ఎంపిక చేసారు. ఒకే సారి లోక్ సభ.. అసెంబ్లీ అభ్యర్ధులను ఇడుపులపాయ వేదికగా ప్రకటించారు. నాటి పాదయాత్ర లో జగన్ ఇచ్చిన హామీలను..మాటలను ఏపీ ప్రజలు విశ్వసించారు. ఊహించని విధంగా 2019 ఎన్నికల్లో 151 సీట్లు కట్టబెట్టి సీఎంను చేసారు.

అధికారం దగ్గర చేసిన పాదయాత్ర

అధికారం దగ్గర చేసిన పాదయాత్ర


అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను దాదాపుగా 95 శాతం అమలు చేసినట్లు వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఈ మూడేళ్ల కాలంలో జరిగిన ప్రతీ ఎన్నికలోనూ వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. వైసీపీ మాత్రమే కాదు..ప్రతిపక్షాలు సైతం సీఎం జగన్ ను సీఎం చేసిన ప్రజా సంకల్ప యాత్ర అని అంతర్గతంగా అంగీకరిస్తారు. రాజకీయంగా ప్రజా సంకల్ప యాత్ర ఒక రికార్డుగా నిలిచిపోతుంది. ఇప్పుడు వై నాట్ 175 సీట్లు అనే నినాదంతో వచ్చే ఎన్నికల కోసం సీఎం జగన్ సిద్దం అవుతున్నారు. జగన్ పాదయాత్ర టు అధికారం దాకా సాగిన రాజకీయ ప్రయాణన్నివైసీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. నాడు జగన్ తో కలిసి యాత్ర చేసిన వారిని సన్మానిస్తున్నారు.

English summary
YRCP celebrates Jagan praja sankalpa Yatra fifth Anniversy, Recollecting the memories fo yatra to CM Seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X