నాటి మా కృషి ఫలితమే నేడు భోగాపురంలో- వారికి జగన్ అభినందనలు..!!

భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో తొలి విమానం లాండ్ అయింది. భోగాపురం విమానా శ్రయాన్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 96 శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్లు జీఎంఆర్‌ సంస్థ వెల్లడించింది. ఇక భోగాపురం ఎయిర్‌పోర్టును జూన్‌ 26వ తేదీన ప్రారంభించనున్నారు. తొలి విమానం లాండ్ అవ్వటం పైన మాజీ సీఎం జగన్ స్పందించారు. కీల కీలక అంశాలను ప్రస్తావించారు. అభినందనలు తెలిపారు.

భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్‌ అయ్యింది. వ్యాలిడేషన్‌ (టెస్ట్‌) ఫ్లైట్‌ ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చింది. ఈ టెస్ట్ ఫ్లైట్ విజయ వంతం కావడంతో త్వరలోనే ఈ ప్రాంతం నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విమానాశ్రయం అందు బాటులోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది. కాగా, తొలి విమానం లాండ్ కావటం పైన మాజీ సీఎం జగన్ స్పందించారు. కీలక అంశాలను ప్రస్తావిస్తూ.. తమ కృషిని వివరించారు. ఈ మేరకు చేసిన ట్వీట్ లో... "విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో తొలివిమానం ల్యాండింగ్ కావ‌డం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి మార్గంలో ఒకమైలురాయి. #VisionVizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడింది... అని పేర్కొన్నారు.

ys-jagan-made-key-statement-over-first-flight-landed-in-bhogapuram-air-port

దీనికి కొనసాగింపుగా.. "ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన GMR గ్రూప్‌కు నా హృదయపూర్వక అభినందనలు. మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు, ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్త‌యింది. ఆ రోజు మేం చేసిన కృషి ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచింది. అలాగే, విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్‌పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన నితిన్ గడ్కరీ గారి కృషి, సహకారం నాకు ఎంతో గుర్తుంది..." అంటూ జగన్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+