కమ్మవారిని ఎందుకు వేధిస్తున్నారు, మీకు ఊడిగం చేయాలా - జగన్ సంచలనం..!!

మాజీ సీఎం జగన్ రూటు మార్చారు. చంద్రబాబు పైన సామాజిక వర్గాలను వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. కమ్మ వర్గం చంద్రబాబుకు ఊడిగం చేయాలా అని ప్రశ్నించారు. వైసీపీలో ఉన్న కమ్మవారిని ఎందుకు వేధిస్తున్నారని నిలదీసారు. నిర్మాత దగ్గుబాటి సురేశ్ కు చెందిన భూములు విశాఖలో ఉంటే రద్దు చేసారని చెప్పుకొచ్చారు. వల్లభనేని వంశీ నుంచి పలువురు కమ్మ నేతలను చంద్రబాబు టార్గెట్ చేసారని వరుసగా లిస్టు చెప్పుకొచ్చారు.

జగన్ వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి జగన్ సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో వైసీపీ నేత నాగమళ్లేశ్వర రావు విగ్రహం ఆవిష్కరించారు. జగన్ పర్యటన పైన పోలీసులు ఆంక్షలు విధించారు. తన నివాసం నుంచి రెంట పాళ్ల వరకు వరకు జగన్ భారీ ర్యాలీగా వెళ్లారు. రెంటపాళ్లకు చేరుకున్న జగన్ అక్కడ నాగమల్లేశ్వర రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తరువాత సీఎం చంద్రబాబు లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. 2024 ఎన్నికల ఫలితాల తరువాత స్థానిక టీడీపీ, జనసేన నేతలు నాగమళ్లేశ్వర రావును వేధించారని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయం లోనే అనుకూల పోలీసు అధికారులను నియమించుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వస్తూనే.. నాగమల్లేశ్వర రావును వేధించగా.. ఆయన భరించలేక ఆత్మహత్య కు పాల్పడ్డారని జగన్ వివరించారు.

YS Jagan made serious allegations against CM Chandra Babu in Rentapalla

కమ్మవర్గం అంటే
జగన్ ఈ సారి సామాజిక వర్గం పేరుతో చంద్రబాబు తీరును ఎండగట్టారు. రాక్షసులు కన్నా అన్యాయంగా పాలన చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవులవుతోందని ఫైర్ అయ్యారు. పోలీసు అధికారులు కులం పేరి పెట్టి పార్టీల గురించి ప్రశ్నించి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదే సమయంలో జగన్ కొత్త నినాదంతో చంద్రబాబును టార్గెట్ చేసే ప్రయత్నం చేసారు. కమ్మ వారు తమ పార్టీలో ఉంటే అభ్యంతరమా అని ప్రశ్నించారు. కమ్మ వారు చంద్రబాబుకు ఊడికన చేయటానికే పుట్టారా అంటూ నిలదీసారు. చంద్రబాబుకు వ్యతిరేకం గా ఎవరైనా మాట్లాడితే వెంటాడి వేధించి హింసించి జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. ప్రాణాలు పోయేలా అవమానిస్తున్నారని మండిపడ్డారు.

ఏ పాపం చేసారని
వల్లభనేని వంశీ ఇన్ని రోజులు జైల్లో పెట్టారని.. ఒక కేసులో బెయిల్ వచ్చాక మరో కేసు పెడుతూ.. రెండు నెలలుగా వంశీ జైల్లోనే ఉంచారని జగన్ ఫైర్ అయ్యారు. కొడాలి నాని ఏం పాపం చేసారని కేసులు పెట్టి వేధిస్తున్నారని ప్రశ్నించారు. అబ్బయ్య చౌదరి పైన కేసులు పెట్టారని.. దేవినేని అవినాశ్ పైన కేసులు పెట్టి రోజు హింసిస్తున్నారని ఫైర్ అయ్యారు. తలశిల రఘురాం, ఎంవీవీ సత్యనారాయణ ను వేధిస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు. అన్నాబత్తుని శివ, పోసానిని వేధించారని జగన్ పేర్కొన్నారు. దగ్గుబాటి సురేశ్ ను విశాఖలో భూ కేటాయింపులు రద్దు చేసారంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. కమ్మం వర్గం వారు వైసీపీలో ఉండకూడదా అంటూ జగన్ ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనకు కొందరు పోలీసు అధికారులు మద్దతు పలుకుతున్నారని.. అటువంటి వారిని వదిలేదని జగన్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+