రాహుల్ ఎందుకొస్తున్నారో అర్థం కావట్లే, జగన్‌ని తీసుకెళ్తారేమో: గాలి

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఆత్మహత్యలు తక్కువగా ఉన్నప్పటికీ, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఎందుకు పర్యటిస్తున్నారో అర్థం కావడం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు సోమవారం చిత్తూరు జిల్లా తిరుపతిలో అన్నారు.

పదేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో 26వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. అయినా కాంగ్రెస్ పార్టీ లేదా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఉన్నట్టుండి రైతుల పైన ఎందుకు ప్రేమ పుట్టిందన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నేతలు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తల్లి, పిల్ల కాంగ్రెస్ పార్టీలు కలిపి టిడిపిని అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.

YS Jagan may join in Congress: Gali

కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా జగన్ పార్టీలోకి వెళ్తున్నారని, వారంతా కలిసి తిరిగి ఆయనను కాంగ్రెస్‌లోకి తీసుకు వస్తారేమో అన్నారు. ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కూడా త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారన్నారు. పనికిమాలిన ప్రతిపక్షాలు దొరకడం దురదృష్టకరమన్నారు.

విభజన హామీలు అమలు చేయాలి: సుజన

విభజన హామీలను వెంటనే అమలు చేయాలని కేంద్రమంత్రి సుజనా చౌదరి ఢిల్లీలో అన్నారు. విభజన చట్టంలోని లోపాలను సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+