ఎన్నికలు అప్పుడే.. అందరూ సిద్ధం కండి: వైఎస్ జగన్

మరో ఏడాదిన్నరలో ఎన్నికలకు వెళ్లబోతున్నామని, ఈ రోజు నుంచే కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆలూరు నుంచి వచ్చిన కార్యకర్తలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మూడు సంవత్సరాల కాలంలో మనం చేసిన మంచి పనులన్నింటినీ ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు.

 ఐకమత్యంగా ఉంటే మనదే విజయం

ఐకమత్యంగా ఉంటే మనదే విజయం


అందరూ కలిసికట్టుగా ఒక్కటిగా ఉంటేనే విజయాలు సాధించగలుగుతామని, ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలను ముందుగా ప్రాధాన్యం ఉన్న పనుల కోసం కేటాయిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల ప్రజలు ఏది మేలు జరిగేవిధంగా అడుగుతున్నారో ఆ పనిని చేయించాలని సూచించారు. ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ మూడు సంవత్సరాల్లో రూ.1050 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని వివరించారు. ప్రతి ఎమ్మెల్యే కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండాలని ఆదేశించామని, ప్రతి గ్రామంలో రెండురోజులపాటు శాసనసభ్యుడు పర్యటిస్తారని చెప్పారు.

మేలు జరిగింది కాబట్టే ఆశీస్సులు

మేలు జరిగింది కాబట్టే ఆశీస్సులు


ముఖ్యమంత్రిగా తాను అందరికీ అందుబాటులో ఉండటం సాధ్యం కాదని, అందుకు బదులుగా ఎమ్మెల్యే ఉంటారన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దేవుడి దయవల్ల బాగానే జరుగుతోందని, తనకు వీలు కుదిరినప్పుడల్లా ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలను కలుస్తున్నానన్నారు. ఈ మూడు సంవత్సరాల్లో మనం చేసిన ప్రతి మంచి పనిని ప్రతి ఇంటికీ తీసుకువెళుతున్నామని, ఆ కుటుంబానికి జరిగిన మేలును కూడా వివరించి చెబుతున్నామని, ఆ మేలు జరిగింది కాబట్టే వారి ఆశీస్సులు తీసుకుంటున్నామన్నారు.

క్రాస్ చెక్ చేసుకుంటున్న జగన్

క్రాస్ చెక్ చేసుకుంటున్న జగన్


సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు వీలు కుదిరినప్పుడల్లా ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇటీవలే ప్రారంభించారు. అన్ని నియోజకవర్గాల్లో తాను ప్రచారం చేయం సాధ్యంకాదు కాబట్టి అట్టడుగు స్థాయిలో కూడా పార్టీ గురించి, ప్రభుత్వం గురించి ప్రజలు ఏమంటున్నారు? అనేది తెలుసుకోవడానికి ఆయన కార్యకర్తలను అడిగి తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యేలతో, మంత్రులతో కూడా తరుచుగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్న జగన్ ఆయా సమావేశాల్లో వారి నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకొని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+