టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ది ఫిక్స్ - జగన్ ఆపరేషన్ విశాఖ, గెలిచేదెవరు..!!
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. వైసీపీకి సంఖ్య పరంగా బలం ఉన్నా..కూటమి నేతలు గెలుపు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. వైసీపీ నుంచి ఇప్పటికే మాజీ మంత్రి బొత్సా సత్యానారాయణ ను జగన్ తమ అభ్యర్దిగా ఖరారు చేసారు. టీడీపీ నేతలు తమ అభ్యర్దిని దాదాపుగా ఫైనల్ చేసాయి. ఈ సమయంలోనే జగన్ రెండు రోజుల పాటు విశాఖ నేతలతో సమావేశం కానున్నారు. కొత్త స్కెచ్ తో రెండు పార్టీలు బరిలోకి దిగుతున్నాయి.
హోరా హోరీ
విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 30న ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికను టీడీపీ కూటమి, వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. స్థానిక సంస్థల కోటాలో జరిగే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక లో వైసీపీకి సంఖ్యా పరంగా బలం ఉంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితం అయిన వైసీపీ ఈ స్థానంలో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. అందులో భాగంగా తమ పార్టీ అభ్యర్దిగా మాజీ మంత్రి బొత్సాను జగన్ ప్రకటించారు. ఈ రోజు, రేపు విశాఖకు చెందిన పార్టీ నేతలతో జగన్ ఎమ్మెల్సీ ఎన్నిక పైన సమావేశం అవుతున్నారు.

టీడీపీ అభ్యర్దిగా
టీడీపీ కూటమి నేతలు తమ అభ్యర్ది పైన కసరత్తు చేసాయి. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్దిగా పీలా గోవింద సత్యానారాయణ పేరు దాదాపు ఖరారైంది. ఈ రోజు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పీలా గోవింద సత్యనారాయణ 2014-19 కాలంలో అనకాపల్లి ఎమ్మెల్యేగా పని చేసారు. 2024ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో పోటీకి ఛాన్స్ దక్కలేదు. కూటమి నుంచి ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతలను చంద్రబాబు ఖరారు చేసారు. మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఎన్నిక బాధ్యతలు తీసుకోనున్నారు.
జగన్ ఆపరేషన్
ఇదే సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు. ఎన్నిక జరిగే వరకూ వైసీపీ ఓటర్లు కూటమి వైపు చూడకుండా కాపాడుకొనేలా సీనియర్లకు బాధ్యతలు కేటాయించారు. మాజీ మంత్రులు కన్నబాబు, బూడి ముత్యాల నాయుడు, అంబటి రాంబాబును రంగంలోకి దించారు. నేడు, రేపు జరిగే సమీక్షలో జగన్ ఎన్నికలో వ్యవహరించాల్సిన తీరు పైన దిశా నిర్దేశం చేయనున్నారు. తమ పార్టీ ఓటర్లతో వైసీపీ క్యాంపు నిర్వహించే అవకాశం ఉంది. జగన్ సైతం ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకోవటం..అటు కూటమి ఎలాగైనా గెలివాలనే పట్టుదలతో ఉండటంతో ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications