రోజా సహా 4గురిపై కేసు, పోరాడుతాం: జగన్, రోజా ఫైర్

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నిమ్స్‌లో చికిత్స పొందుతున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కేసులకు సంబంధించి తాము న్యాయస్థానంలో పోరాడుతామన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టారని ఆరోపించారు.

పార్టీలో కీలకంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టారని జగన్ మండిపడ్డారు. భూమా పైన రౌడీషీట్ పెట్టడం సరికాదన్నారు. యాక్టివ్‌గా ఉన్న తమ నేతల పైన కేసులు పెడుతున్నారన్నారు. తమ పార్టీకి చెందిన కీలకమైన నలుగురు ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టారన్నారు.

పార్టీలోని కీలకమైన నగరి ఎమ్మెల్యే రోజా, పూతలపట్టి ఎమ్మెల్యే సునీల్ కుమార్, మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి, ఇప్పుడు భూమా పైన కేసులు పెట్టారన్నారు. ప్రజల తరఫున పోరాడుతున్న వారిని ఇబ్బంది పెడుతున్నారన్నారు. భూమా నాగిరెడ్డి అరెస్టు వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ స్థాయికి దిగజారాడో అర్థమవుతోందన్నారు.

YS Jagan meets Bhuma Nagi Reddy

భూమా సహా నలుగురు ఎమ్మెల్యేల పైన అక్రమ కేసులు బనాయించారన్నారు. సమస్యల పైన భూమా మున్సిపల్ సమావేశంలో మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులే గొడవ సృష్టించారన్నారు. భూమా పైన ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టారని, ఎవరెన్ని కుతంత్రాలు చేసినా అన్యాయం పైన తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

రోజా ఆగ్రహం

తమ నాయకుల పైన కేసులు పెడితే కార్యకర్తలు పారిపోతారని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి శాసన సభ్యురాలు రోజా అన్నారు. తమ నేతల పైన అక్రమంగా కేసులు బనాయించారని ఆమె చిత్తూరు జిల్లాలో ధ్వజమెత్తారు.

అక్రమ కేసులను వెంనటే ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేసులు ఎత్తి వేసే వరకు తాము ఉద్యమాలు కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ పార్టీ నేతలు, ఎమ్మెల్యేల పైన అక్రమ కేసులు పెడితే ఏమాత్రం సహించమని రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. కార్యకర్తలకు తాము ఎప్పుడు అండగా ఉంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+