బాబు చర్మం మందం, మన ఖర్మ: దులిపిన జగన్
న్యూఢిల్లీ: వైసీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం నాడు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చర్మం మందంగా ఉన్న ముఖ్యమంత్రి ఉండటం మనం చేసుకున్న ఖర్మ అన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. కేంద్రమంత్రులు, ప్రధాని మోడీలను కలిసేందుకు రెండు రోజుల పాటు జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రాజ్ నాథ్‌ను కలిసి అనంతరం మాట్లాడారు.

కృష్ణా జలాల విషయంలో భావోద్వేగాలను రెచ్చగొట్టి డ్యాం వద్ద గొడవలు రేపారని, రైతుల ప్రయోజనాలను మంటగలుపుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాము రాజ్ నాథ్ సింగ్‌కు చెప్పామన్నారు. ప్రధాని, రైల్వే మంత్రుల అపాయింటుమెంట్ కూడా కోరామన్నారు.
రాష్ట్రానికి అన్ని రంగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని వాళ్లకు వివరిస్తామని చెప్పారు. ఇప్పటికే చాలాసార్లు విజ్ఞప్తులు చేశామని చెప్పారు. తమవంతు బాధ్యతగా విభజన టట్టంలోని అంశాలను అమలు చేయాల్సిందిగా కోరుతున్నామని జగన్ చెప్పారు.












Click it and Unblock the Notifications