జగన్ లాబీయింగ్: మాటతప్పమని రాజ్ హామీ(పిక్చర్స్)
న్యూఢిల్లీ: తాము చిన్న రాష్ట్రాలకు అనుకూలమని, తెలంగాణపై ఇచ్చిన మాట తప్పలేమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం చెప్పారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయ పార్టీల మద్దతు సాధించే ప్రయత్నాలలో భాగంగా జగన్ ఆదివారం బిజెపి అధ్యక్షుడిని కలిశారు.
ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచేందుకు కేంద్రంలోని యూపిఏ సంకీర్ణ సర్కారుపై ఒత్తిడి తేవాలని రాజ్‌నాథ్ సింగ్‌కు జగన్ విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు బిజెపి కట్టుబడి ఉందని స్పష్టం చేసిన రాజ్‌నాథ్, విభజనలో సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడేందుకు పార్లమెంటులో కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
జగన్‌తో పాటు పార్టీ సీనియర్లు మైసూరా రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, కొణతాల రామకృష్ణ, గట్టు రామచందర్ రావు, బాలశౌరి తదితరులు రాజ్‌నాథ్‌ను ఆదివారం రాత్రి ఏడుగంటల ప్రాంతంలో కలిసి దాదాపు గంటపాటు విభజన అంశంపై చర్చలు జరిపారు. జగన్ ఈరోజు హైదరాబాద్ రానున్నారు.

రాజ్ - జగన్ 1
సమైక్యాంధ్రను కాపాడేందుకు తోడ్పడాలంటూ జగన్ ల్యాప్‌టాప్‌పై రాజ్‌నాథ్‌కు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మధ్యలో మైసూరారెడ్డి, రాజమోహన్ రెడ్డి కూడా రాజ్‌నాథ్‌కు రాష్ట్ర చరిత్రను వివరించారు.

రాజ్ - జగన్ 2
యూపిఏ సంకీర్ణ ప్రభుత్వం రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా తెలంగాణను ఏర్పాటు చేస్తోందని జగన్ ఆరోపించారు. రాష్ట్ర విభజన వల్ల తెలుగు ప్రజలకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే తెలుగు ప్రజలు అభివృద్ధి సాధ్యమవుతుందని వాదించారు.

రాజ్ - జగన్ 3
రాజ్‌నాథ్ మాత్రం ఆయన చెప్పినదంతా సావధానంగా విని, బిజెపి విధానాన్ని జగన్‌కు వివరించారు. తెలంగాణ ఏర్పాటుకు బిజెపి కట్టుబడి ఉందని, ప్రజలకు ఇచ్చిన హామీని వమ్ము చేయలేమని స్పష్టం చేశారట.

రాజ్ - జగన్ 3
అయితే సీమాంధ్ర ప్రయోజనాలను కాపాడేందుకు పార్లమెంటులో తమవంతు కృషి చేస్తామని రాజ్‌నాథ్ ఆయనకు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications