రాష్ట్రపతితో వైయస్ జగన్ భేటీ: కాల్ మనీ, రోజా వ్యవహారంపై ఫిర్యాదు

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం వైయస్ జగన్ పార్టీ సీనియర్ నేతలతో కలసి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ను కలిశారు.

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన ప్రణబ్.. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో బస చేస్తున్న సంగతి తెలిసింది. వైయస్ జగన్ ముఖ్యంగా నాలుగు విషయాలను రాష్ట్రపతి ప్రణబ్ దృష్టికి తీసుకెళ్లిన్నట్టు తెలుస్తోంది.

YS Jagan met President Pranab Mukherjee

మహిళల మాన, ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం, ఏపీ ప్రభుత్వం ట్రైబల్ అడ్వైయిజరీ కమిటీని ఏర్పాటు చేయకపోవడం, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయాల గురించి జగన్.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

YS Jagan met President Pranab Mukherjee

వైయస్సార్ మేనత్త రాజమ్మ మృతి

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి మేనత్త రాజమ్మ(80) ఆదివారం మృతి చెందారు. కడప జిల్లా పులివెందుల పట్టణంలోని బేతేల్ చర్చిలో ఆదివారం ఉదయం ప్రార్థనలు చేస్తూ ఆమె హఠాన్మరణం చెందారు. భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించేందుకు వైయస్ విజయమ్మ ఆదివారం సాయంత్రం రానున్నారని బంధువులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+