టీడీపీకి, మాకు కేవలం 5 లక్షల ఓట్ల తేడా: జగన్
హైదరాబాద్: ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, మాకు కేవలం 5 లక్షల ఓట్ల తేడా మాత్రమే ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ప్రకాశం జిల్లా పార్టీ సమీక్షా సమావేశాల్లో భాగంగా ఒంగోలులో మాట్లాడారు.
ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేందుకు చంద్రబాబు ఎన్నో అబధ్దాలు చెప్పారని అన్నారు. చంద్రబాబులా తాము కూడా అబద్ధాలు చెప్పి ఉంటే, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు.

చంద్రబాబుకు లేనిది, మనకున్నది దేవుడి దయ మాత్రమేనని ఆయన తన పార్టీ నేతలు, కార్యకర్తలతో చెప్పారు. అనంతరం కందుకూరు నియోజకవర్గం పార్టీ నేతలతో సమీక్షా సమావేసం నిర్వహించారు.












Click it and Unblock the Notifications