YS Jagan: పులివెందులలో జగన్ ప్రజాదర్బార్ -భారీగా తరలివచ్చిన జనం..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ వైఎస్సార్ జిల్లా పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించారు. నాలుగు రోజుల జిల్లా టూర్ లో ఉన్న వైఎస్ జగన్ .. తన సొంత నియోజకవర్గం పులివెందులలో స్థానికుల నుంచి చాలా కాలం తర్వాత ఫిర్యాదుల్ని స్వీకరించారు.

దీంతో జనం కూడా జగన్ ను కలిసేందుకు భారీగా తరలివచ్చారు. క్రిస్మస్ పండుగ జరుపుకునేందుకు సొంత జిల్లాకు వెళ్లిన జగన్.. అందులో భాగంగా నేతలతో ఇప్పటికే భేటీలు నిర్వహించారు.

ys jagan mohan reddy first praja darbar in pulivendula after loosing power

వైఎస్సార్ జిల్లా టూర్ లో ఉన్న వైఎస్ జగన్ ఇవాళ ఉదయం పులివెందులలోని వైఎస్ అవినాష్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. నాలుగు రోజులుగా నియోజకవర్గంలోనే ఉన్న జగన్.. ఇవాళ క్యాంప్ ఆఫీసుకు రావడంతో జనం కూడా భారీగా తరలివచ్చారు. దీంతో పులివెందుల వీధులు కిక్కిరిసిపోయాయి. స్థానిక సమస్యలపై జనం ఎక్కువగా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం మారాక పులివెందులలో పరిస్ధితులపై వారు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం.

వైఎస్సార్ జిల్లాతో పాటు రాయలసీమలోని ఇతర జిల్లాల నుంచి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రజాదర్బార్ కు తరలివచ్చారు. దీంతో జగన్ కూడా వారి నుంచి వినతులు స్వీకరించారు. ఓపిగ్గా వారు చెబుతున్న సమస్యలు వింటున్నారు. రాష్ట్రంలో సీఎంగా ఉండగా తీరిక లేని షెడ్యూల్స్ తో పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించలేక తో సోదరుడు, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో ఏర్పాటు చేయించేవారు. జనం కూడా జగన్ కు చెప్పుకోవాల్సిన విషయాలు అవినాష్ కు చెప్పుకునే వారు. అధికారం కోల్పోయాక జగన్ ప్రస్తుతం నేరుగా జనంతో భేటీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+