రాహుల్ నుంచి రాజకీయాలు నేర్చుకోలేదు: వైయస్ జగన్ (ఫోటోలు)
హైదరాబాద్: అనంతలో వైయస్ జగన్ ఐదో రోజు రైతు భరోయా యాత్ర కొనసాగుతోంది. శుక్రవారం పెనుకొండ నియోజక వర్గంలో ఆయన పర్యటించారు. రొద్దం మండలం పి.కొత్తపల్లి గ్రామంలో భరోసా యాత్రలో భాగంగా వైయస్ జగన్ మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి తాను రాజకీయాలు నేర్చుకోలేదని వైయస్ జగన్ అన్నారు. కాంగ్రెస్ పెద్దలు అవకాశవాద రాజకీయాలు నడుపుతున్నారన్నారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ లేదని విమర్శించడం బాధాకరమన్నారు.

రాహుల్ నుంచి రాజకీయలు నేర్చుకోలేదు: వైయస్ జగన్(ఫోటోలు)
కాంగ్రెస్ అధ్యక్షురాలు అవసరం ఉన్నప్పుడు దండలు వేశారని, అవసరం తీరిపోగానే బండలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి తమ కుటుంబం ఎంతో సేవ చేసిందని గుర్తుచేశారు.

అవసరం ఉంటే దండలు, తీరిపోగానే బండలు: వైయస్ జగన్
తన తండ్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి చివరి రక్తపుబొట్టునూ కాంగ్రెస్ పార్టీకే ధారపోశారన్నారు. ఆయన దుర్మరణం తర్వాత తాను ఓదార్పుయాత్ర చేపట్టగానే కాంగ్రెస్ పెద్దలకు తాము చెడ్డవారమై పోయామన్నారు.

అవసరం ఉంటే దండలు, తీరిపోగానే బండలు: వైయస్ జగన్
తాను రైతు భరోసాయాత్ర చేపట్టినందు వల్లే అనంత పరిస్ధితి యావత్ దేశానికి తెలిసిందన్నారు. రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, మహిళా సంఘాలు, ఉపాధి హామీ కూలీల దుర్భర జీవితాన్ని తెలియచేయడం వల్లే రాహుల్ గాంధీ హుటాహుటిన రాష్ట్రంలో పర్యటించాని అన్నారు.

అవసరం ఉంటే దండలు, తీరిపోగానే బండలు: వైయస్ జగన్
యావత్ రాష్ట్ర ప్రజలు విభజన వద్దని మొరపెట్టుకున్నా కాంగ్రెస్ పార్టీ నిరంకుశత్వంగా వ్యవహరించి పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టిందని వైయస్ జగన్ మండిపడ్డారు.

అవసరం ఉంటే దండలు, తీరిపోగానే బండలు: వైయస్ జగన్
ఇక రొద్దం మండలం పి.కొత్తపల్లి గ్రామంలో అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు లక్ష్మన్న కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. వారికి ధైర్యాన్ని చెప్పారు. రుణాలు మాఫీ కాలేదని, కొత్త రుణాలు ఇవ్వడంలేదని గ్రామ రైతులు ఈ సందర్భంగా జగన్‌కు ఫిర్యాదు చేశారు.

అవసరం ఉంటే దండలు, తీరిపోగానే బండలు: వైయస్ జగన్
అనంతరం ఆయన మడకశిర నియోజక వర్గం తిరుమల దేవరపల్లిలో ఆత్మహత్య చేసుకున్న ఆనందప్ప కుటుంబానికి పరామర్శించనున్నారు. తర్వాత హనుమంతరాయునిపాళెంలో ఆత్మహత్య చేసుకున్న ఓబన్న అనే రైతు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు.












Click it and Unblock the Notifications