జగన్ కు అబద్దాలు చెప్పే అలవాటు లేదు

: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కు అబద్దాలు చెప్పడం అలవాటు లేదని వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కు అబద్దాలు చెప్పడం అలవాటు లేదని వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.

శ్రీకాకుళం జిల్లా పార్టీ ప్లీనరీలో ఆయన బుదవారం నాడు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదనే ఎన్నికల్లో రైతు రుణమాఫీపై తప్పుడు హామీ ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. కోటయ్య కమిటీ సిఫారసులను కూడ అమలు చేయకుండా సీఎం చంద్రబాబు రైతులను దగా చేశారని ఆరోపించారు. కులాలవారీగా హమీ ఇచ్చి వాటిని అమలు చేయకుండా నిలువునా మోసం చేస్తుననారని విమర్శించారు. చంద్రబాబు హామీలే ఇప్పుడు ప్రభుత్వాన్ని పాముగా మారి కాటేస్తున్నాయన్నారు.

ys jagan

ప్రజలకు మతిమరుపు ఎక్కువ అని చంద్రబాబు భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాలను నేరమయం చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందన్నారు.ప్లీనరీ తర్వాత వైసీపీ మరింత నిర్మాణాత్మకమైన పార్టీగా బలపడుతోందని ధర్మాన కృష్ణదాస్ అన్నారు.

మంత్రి అచ్చెన్నాయుడు అభద్రతా భావంలో జగన్ పై విమర్శలు చేస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ఇసుక వ్యాపారం కోసమే ఎమ్మెల్యే వెంకటరమణ పార్టీ మారారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+