జగన్ మరో కొత్త ప్రయోగం-కలెక్టర్లకు గోదావరి బాధితుల రేటింగ్-భారీవర్షంలోనే ఓదార్పు

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ కోనసీమలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే గోదావరి వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల్ని ప్రభుత్వం ఆర్ధిక సాయంతో పాటు ఇతర సాయం చేస్తోంది. అదే సమయంలో వారిని నేరుగా కలుసుకుని భరోసా ఇచ్చేందుకు సీఎం జగన్ అక్కడికి వెళ్లారు. హెలికాఫ్టర్ లో మొదలైన సీఎం జగన్ ప్రయాణం, ఆ తర్వాత లాంచికి, అనంతరం ట్రాక్టర్ కు మారింది.

కోనసీమలో జగన్ ఓదార్పు

కోనసీమలో జగన్ ఓదార్పు

కోనసీమలోని గోదావరి వరదల వల్ల నష్టపోయిన లంక గ్రామాల ప్రజలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇవాళ ఉదయం తాడేపల్లి నుంచి నేరుగా గంటి పెదపూడి కి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ముఖ్యమంత్రి వశిష్ట గోదావరి నదిలో లాంచీ లో ప్రయాణం చేశారు. అనంతరం ట్రాక్టర్ పై ఎక్కి పి. గన్నవరం మండలంలోని పుచ్చకాయల వారి పేట, ఉడిముడి లంక, బూరుగులంక, అరిగిల వారి పేట, ప్రాంతాల్లో పర్యటించారు. కొన్ని ప్రాంతాల్లో కాళీ నడకన బాధితులు వద్దకు వెళ్లి వరదల్లో ప్రభుత్వ సహాయక చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు.

భారీ వర్షంలోనే పరామర్శలు

భారీ వర్షంలోనే పరామర్శలు

ఓవైపు భారీ వర్షం కురుస్తున్నా కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన మాత్రం నిరాటంకంగా కొనసాగుతోంది.ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు వెళ్లిన జగన్ అక్కడ బాగా చూసుకున్నారా అని వరద బాధితుల్ని ప్రశ్నించారు.అక్కడ అందుతున్ సాయంపై పలు ప్రశ్నలు వేశారు. వరదల కారణంగా జనం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని నేరుగా విన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. నేరుగా ముఖ్యమంత్రే వచ్చి ఓదార్చడంతో స్ధానికులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్లకు ఎన్ని మార్కులేస్తారని ప్రశ్న

కలెక్టర్లకు ఎన్ని మార్కులేస్తారని ప్రశ్న

వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో సీఎం జగన్.. బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ఆరా తీసిన సందర్భంగా వారిని మరో ప్రశ్న కూడా వేసారు. జిల్లా కలెక్టర్ కు ఎన్ని మార్కులు వేయవచ్చు అని వరద బాధితులను ముఖ్యమంత్రి అడిగారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతంలో వాలంటీర్లు బాగా చూసుకున్నారని వరద బాధితులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. ఒకపక్క వాతావరణం అనుకూలించక పోయిన మరో పక్క వర్షం పడుతున్న కొనసీమ లంక గ్రామాల్లో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+