నమ్మను, బాబు ప్రమాణానికి వెళ్ల: జగన్, నా గ్రాఫ్‌ఇలా..
రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి వెళ్లే అంశంతో పాటు ఎన్నికల్లో పార్టీ పరాజయం విషయమై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం స్పందించారు. ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. తన గ్రాఫ్ తగ్గిపోయిందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు.
తాము మొదట కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు ఇద్దరమే ఉన్నామని, ఇప్పుడు తమ సంఖ్య 70కి పెరిగిందని చెప్పారు. అలాంటప్పుడు తన గ్రాఫ్ పడిపోయిందని ఎలా అంటారని వ్యాఖ్యానించారు. తమ పార్టీ సమీక్ష సమావేశాల్లో... నేను మారాలి లేదా నాయకులు, కార్యకర్తలు మారాలి అన్న అంశం పైన సమీక్ష జరగలేదని చెప్పారు.

సంస్థాగతంగా జరిగిన తప్పులను సరిదిద్దికుంటామని చెప్పారు. చంద్రబాబు రుణమాఫీ ఓ డ్రామా అన్నారు. చంద్రబాబు తొలి సంతకం రుణమాఫీ పైన పెట్టినా అవి మాఫీ అవుతాయన్న గ్యారెంటీ లేదన్నారు. రుణాలు మాఫీ అవుతాయని తాను నమ్మడం లేదని అభిప్రాయపడ్డారు.
లోటు బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పి అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేయడం అవసరమా అని ప్రశ్నించారు. ఏ అవసరం లేకపోయినా రూ.30 కోట్లతో ప్రమాణం చేయడం అవసరమా అని ప్రశ్నించారు. అలాంటి ప్రమాణ స్వీకారానికి హాజరు కానన్నారు. చంద్రబాబు పైన ఒత్తిడి తేవాలని ప్రజలు తమ పైన బాధ్యతలు పెట్టారన్నారు.












Click it and Unblock the Notifications