నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ వల్ల నష్టమేమీ లేదు, టీడీపీ నేతలు రాబందుల్లా, ఏపీలో మాఫియా సామ్రాజ్యం: తేల్చి చెప్పిన జగన్

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రమంతా మాఫియా సామ్రాజ్యమే ఏలుతోందని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనపైనా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

బుధవారం నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లిలో వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. జన్మభూమి కమిటీల నుంచి సీఎం స్థాయి వరకు అవినీతి జరుగుతోందని ఆరోపించారు. పొదుపు సంఘాలకు చెందిన వడ్డీ డబ్బులను ప్రభుత్వం కట్టడం లేదని అన్నారు. బ్యాంకుల నుంచి అందే ప్రయోజనాలను అందకుండా చేస్తోందని మండిపడ్డారు. కాగా, గత ప్రభుత్వాలు మాత్రం వడ్డీలు కట్టేవని గుర్తు చేశారు.

బాబు మోసాలు

బాబు మోసాలు

చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని జగన్ ఆరోపించారు. రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు మోసం చేశారని అన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధిని 5వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని చెప్పి.. ఇప్పటికీ ఆ పనిచేయలేదని మండిపడ్డారు. తాను 3వేల కోట్లంటే బాబు 5వేల కోట్ల అని చెప్పి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ధ్వజమెత్తారు.

బాబే పెద్ద దళారీ..

బాబే పెద్ద దళారీ..

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే పెద్ద దళారీలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హెరిటేజ్ కోసం తక్కువ ధరలకే రైతుల వద్ద ధాన్యాన్ని కొని హెరిటేజ్ ఫ్రెష్ షాపులో ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని అన్నారు. బాత్రూంలు లేవు, సరైన వసతులు లేవు అని అన్నారు. క్లస్టర్ల పేరుతో స్కూళ్లను తగ్గించుకుంటూ పోతూ.. నారాయణ స్కూళ్లలో చేర్పించే యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోతున్నారని అన్నారు.

చంద్రబాబే సమస్య.. భూముల కబ్జాలపై ఆగ్రహం

చంద్రబాబే సమస్య.. భూముల కబ్జాలపై ఆగ్రహం


రాష్ట్రానికి ప్రధాన సమస్య చంద్రబాబేనని జగన్ అన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేరని అన్నారు. టీడీపీ నేతలు రాబందుల్లా భూకబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. రికార్డులను మార్చేసి భూములను దోచుకుంటున్నారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ జరిపి.. తిరిగి ఎవరి భూములను వారికి ఇచ్చేస్తామని జగన్ స్పష్టం చేశారు. భూ కబ్జాలకు పాల్పడిన వారిని, అందుకు సహకరించిన అధికారులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. అసైన్డ్ భూములంటే అత్తగారి సొమ్ము అనుకుంటున్నారని మండిపడ్డారు.

పవన్ వల్లే నష్టమేమీ లేదు

పవన్ వల్లే నష్టమేమీ లేదు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని అన్నారు. గత ఎన్నికల్లోనే పవన్ టీడీపీకి మద్దతు తెలిపారని, అప్పుడు పవన్ అభిమానులు టీడీపీకే ఓటేశారని చెప్పారు. అందువల్ల పవన్ పోటీ చేయడం వల్ల తమ పార్టీకి కొత్తగా ఏర్పడే నష్టమేమీ లేదని జగన్ స్పష్టం చేశారు.

పొత్తుల విషయంపై..

పొత్తుల విషయంపై..

జనసేనే కాదు ఏ సేన వల్ల కూడా తమకు నష్టం జరగదని అన్నారు. పొత్తుల విషయం గురించి ఎన్నికల సమయంలోనే ఆలోచిస్తామని జగన్ చెప్పారు. గత ఎన్నికల్లో పవన్, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసినా తమ కంటే 5లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయని అన్నారు. ఓటింగ్ శాతం కూడా 1శాతమేనని చెప్పారు. పవన్ పోటీ చేయడం వల్ల తమకు ఏ రకంగానూ నష్టం లేదని అన్నారు.

రాబందుల్లా..

రాబందుల్లా..

టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమాపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై స్పందిస్తూ చంద్రబాబు హయాంలో రాష్ట్రంలోని భూములను వీళ్లు సంపాదించే వనరులుగా భావిస్తున్నారని అన్నారు. టీడీపీ నేతలు రాబందుల్లా.. విలువైన భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ భూముల నుంచి రాజధాని భూముల దాకా ఇష్టం వచ్చినట్లుగా కబ్జా చేస్తున్నారని అన్నారు. బలహీనుల వద్ద ఉన్న భూములను లాగేసుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ హయంలో కాంట్రాక్టర్లు, మద్యం, ఇసుక మట్టి, కరెంటు కొనుగోల్లు, అమరావతి భూముల నుంచి బీడు భూముల వరకు కబ్జాలు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. రేషన్, పెన్షన్, మరుగుదొడ్ల నిర్మాణాల్లో కూడా అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు.

బాబు ప్రతిపేజీలోనే అవినీతే

బాబు ప్రతిపేజీలోనే అవినీతే

ప్రభుత్వానికి సిన్సియారిటీ, కమిట్మెంట్, క్రెడిబిలిటీ ఉండాలన, చంద్రబాబు సర్కారుకు ఇవేమీ లేవని జగన్ అన్నారు. బాబు ప్రతీపేజీలోనూ అవినీతేనని అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. బాబు పాలనలో ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. బాబు వ్యవహారం పుండు మీద కారం జల్లినట్లు ఉంటోందని అన్నారు.

పరిశ్రమలు, ఉద్యోగాలు ఎక్కడా?

పరిశ్రమలు, ఉద్యోగాలు ఎక్కడా?

రాష్ట్రానికి హోదా లేకపోవడంతో ఉద్యోగాలు రావడం లేదని అన్నారు. లక్షల్లో పెట్టుబడులు వస్తున్నాయని బాబు మోసం చేస్తున్నారని అన్నారు. పరిశ్రమలు, ఉద్యోగాలు ఏవీ అని జగన్ ప్రశ్నించారు. ఓసారి ఎయిర్‌బస్ అని, మరోసారి మైక్రోసాఫ్ట్ అని, బుల్లెట్ ట్రైన్ వచ్చిందని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి 16లక్షల పెట్టుబడులు వస్తే పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన ఎక్కడ జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు రాకపోవడంతో ప్రభుత్వాన్ని నిరుద్యోగ యువత తిట్టుకుంటోందని అన్నారు. ప్రభుత్వం ఒక్క ఉద్యోగాన్ని కూడా కల్పించలేదని అన్నారు.

English summary
YSRCP president YS Jaganmohan Reddy on Wednesday responded on Pawan Kalyan's Janasena party contesting 2019 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X