వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖకు నేనొస్తా, హోదా కోసం అంతా రాజీనామా చేస్తాం: జగన్ సంచలనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అందరూ కలిసి రావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అందరూ కలిసి రావాలని
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. జనవరి 26న విశాఖపట్నంలో ప్రత్యేక హోదా కోసం జరిగే కొవ్వొత్తుల ప్రదర్శనలో తాను కూడా పాల్గొంటానని స్పష్టం చేశారు. తనను అరెస్ట్ చేస్తారో.. ఇంకేం చేస్తారో.. సీఎం చంద్రబాబుకే వదిలేస్తున్నానని చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణే కాదు, సీఎం హోదాలో ఉన్న చంద్రబాబునాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

YS Jagan on special status issue

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక హోదా కోసం మూడేళ్లు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. అంతేగాక, వచ్చే జూన్‌ వరకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత మళ్లి ఉప ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. దీంతో దేశం మొత్తం ఏపీలో ఏం జరుగుతుందో చూస్తుందని అన్నారు.

అంతేగాక, ఏపీ హోదా అంశం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీస్తుందని అన్నారు. కేంద్రం ఇచ్చిన హామి నెరవేర్చలేదనే విషయం కూడా దేశ ప్రజలకు తెలుస్తుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు కూడా రాజీనామా చేయాలని జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రం నుంచి ఉన్న కేంద్రమంత్రులు రాజీనామా చేయాలన్నారు.

హోదా కోసం ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లి డిమాండ్ చేయాలని చంద్రబాబుకు సూచించారు. అన్ని పార్టీల నేతలను తీసుకుని కేంద్రం వద్దకు వెళ్లాలని, తాను కూడా వస్తానని జగన్చె ప్పారు. హోదా కోసం యువతి జిల్లాల కేంద్రాల్లో ప్రశాంతంగా కేండిల్ ర్యాలీలు చేస్తామంటే జరపకూడదని బాబు ఆదేశాలు జారీ చేస్తున్నారని మండిపడ్డారు. నువ్వు చేయవు.. చేయనివ్వవు? అని చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు.

చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే హోదా కోసం తమ పార్టీ కేంద్రమంత్రులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఎంపీలందరం రాజీనామా చేద్దామని, మళ్లీ ఎన్నికలకు పోదామని పిలుపునిచ్చారు. దీంతోనైనా కేంద్రం దిగివస్తుందని అన్నారు. ప్రత్యేక హోదాపై ఇంకా కూడా స్పందించకపోతే వచ్చే ఎన్నికల్లో దేవుడు, ప్రజలు.. చంద్రబాబును బంగాళా ఖాతంలో కలుపుతారని అన్నారు.

అసాధ్యమైన తెలంగాణ వచ్చింది పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ ఎందుకు అమలు కాదని అన్నారు. హోదా రాకపోతే మనమందరం తలదించుకోవాలని అన్నారు. జల్లికట్టు అనే ఆట కోసం తమిళనాడులోని అన్ని పార్టీలు ఏకమయ్యాయని, సీఎం కూడా ఇతర పార్టీల నేతలతో కలిసి ప్రధానిని కలిశారని చెప్పారు. సుప్రీంకోర్టు వద్దని చెప్పినా.. తమిళలు జల్లికట్టు ఆర్డినెన్స్ తెప్పించుకున్నారని తెలిపారు. అలాంటిది మనం హోదా ఎందుకు సాధించుకోలేమని అన్నారు.

కట్టడి చేయడం బాధాకరం

ప్రత్యేక హోదాను కట్టడి చేసేందుకు సీఎం ప్రయత్నించడం బాధాకరమని జగన్ అన్నారు. హోదా వల్ల పారిశ్రామిక రాయితీలు వస్తాయని అన్నారు. హోదాలోని అన్ని అంశాలు ప్యాకేజీలో వచ్చాయని బాబు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ప్యాకేజీలో హోదా రాయితీలు అందాయా? అని ఆయన ప్రశ్నించారు.

హోదా ఉంటే పరిశ్రమలు పెడితే పన్ను రాయితీలు వస్తాయని, హోదా కలిగిన రాష్ట్రాలకే రాయితీలు ఉంటాయని చెప్పారు. హోదా లేని ఏ రాష్ట్రానికి ఇప్పటి వరకు రాయితీలు ఇవ్వలేదని అన్నారు. హోదాతో రాయితీలు వస్తాయని, దీంతో పరిశ్రమలు వస్తాయని అన్నారు. లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. హోదా కోసం తాము చాలాసార్లు ధర్నాలు చేశామని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా బాబు, వెంకయ్యలు గతంలో అన్న వీడియోలను చూపించారు. బాబు గతంలో 5ఏళ్లు హోదా చాలదని, 15ఏళ్లు కావాలని డిమాండ్ చేసిన ఓ వీడియోను చూపించారు. వెంకయ్య కూడా పార్లమెంటులో ఇలాంటి మాటలే మాట్లాడారని చెప్పారు. హోదా రాయితీలేవీ మన రాష్ట్రానికి రాలేదని అన్నారు. మనకు అన్ని వచ్చేశాయని బాబు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy on Wednesday responed on special status issue of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X