అధైర్యపడొద్దు, ఆత్మహత్యలు వద్దు: వైయస్ జగన్

Subscribe to Oneindia Telugu

అనంతపురం: ఇటీవల చోటు చేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హిందూపురానికి చెందిన నవీన్‌ (23) అనే విద్యార్థి తాను బీటెక్ చ‌దివిన‌ప్ప‌టికీ ఉద్యోగం రాలేద‌ని పేర్కొంటూ బుదవారం ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

మ‌రోవైపు ఇదే కార‌ణంతో ఎమ్మెస్సీ, బీఈడీ చదివిన విశాఖప‌ట్నంలోని పాయకరావుపేట మండలం మంగవరం గ్రామ వాసి శ్రీను (28) పురుగు మందు తాగి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఈ విష‌యంపై స్పందిస్తూ జగన్మోహ‌న్‌ రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని నిందించారు.

 ys jagan on students suicide

నిరుద్యోగుల ఆత్మహత్యలు బాధాకరమని జగన్ పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు అధైర్యపడొద్దని అన్నారు. ఉద్యోగాల భర్తీ చేయ‌లేక‌పోతున్న ప్ర‌భుత్వం మ‌రోవైపు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించారు.

ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను కేంద్రం ముందు తాకట్టు పెట్టడంతోనే ఇక్క‌డ ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డులు రాక‌ నిరుద్యోగంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నార‌ని అన్నారు. అంద‌రం పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందామ‌ని జగన్ పిలుపునిచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP president YS Jaganmohan Reddy responded on students suicide issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి