జగన్ మార్క్ ..పెనమలూరు నుంచి జోగి రమేష్ అవుట్..!

వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ పార్టీ ప్రక్షాళన చేపట్టారు. ఎన్నికల్లో దారుణంగా పార్టీ ఓడిపోవడంతో జగన్ వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. ముందుగా పార్టీని బలోపేతం చేయడానికి ఆయన సిద్దమవుతున్నారు. దీనిలో భాగంగానే వైసీపీలో ప్రక్షాళన షూరు చూశారు. ఇటీవలే సొంత జిల్లా అధ్యక్షులను మార్చారాయన.కడప, అన్నమయ్య జిల్లాల ఇంచార్జ్‌లను మార్చి తనదైన శైలిలో రాజకీయాలను మొదలుపెట్టారు. కడప జిల్లాకు సొంత మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు.

అలాగే ఆయన కుమారుడు నరేన్ రామానుజన్ రెడ్డిని కమలాపురం ఇంచార్జ్‌గా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని జిల్లా అధ్యక్షులుగా నియమించారు. అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని తప్పించి జగన్, ఆయనకు ఉన్నత పదవిని అప్పగించారు. పార్టీ సమన్వయ ప్రధాన కార్యదర్శిగా గడికోట శ్రీకాంత్‌రెడితో పాటు వేంపల్లి సతీష్‌రెడ్డిలను ప్రకటించారు. పార్టీ మరో ప్రధాన కార్యదర్శిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరును ఖారారు చేశారు.

YS Jagan orders appointing Jogi Ramesh as Mylavaram Constituency Coordinator

తాజాగా మరో రెండు నియోజకవర్గాలకు ఇంచార్జులను నియమించారు. మాజీ మంత్రి జోగి రమేష్‌ను పెనమలూరు బాధ్యతల నుంచి తప్పించారు. పెనమలూరు వైసీపీ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తికి బాధ్యతలు అప్పగించారు. జోగి రమేష్‌ను మైలవరం నియోజకవర్గం సమన్వయకర్తగా నియమిస్తూ వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా ,బీసీ సెల్‌ అధ్యక్షుడు రమేష్‌ యాదవ్‌,ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా టీజేఆర్‌ సుధాకర్‌ చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి,విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్య, ఏలూరు జిల్లా అధ్యక్షడిగా దూలం నాగేశ్వరరావు పేర్లను జగన్ ఇప్పటికే ఖారారు చేసిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+