గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Family Doctorపై వైఎస్ జగన్ కీలక ఆదేశాలు-కొత్తయాప్ ల వాడకం-రాష్ట్రస్ధాయి పర్యవేక్షణ

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైయస్‌.జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్, ఆరోగ్యశ్రీ, నాడు - నేడు వంటి అంశాలపై సీఎం సమీక్ష చేపట్టారు. అక్టోబరు 21న ప్రారంభించిన ఫ్యామిలీ డ్యాక్టర్‌ కాన్సెప్ట్‌ పైలెట్‌ ప్రాజెక్టు అమలుపై సీఎం సమగ్ర సమీక్ష చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రాజెక్టు అమలుకోసం తీసుకుంటున్న చర్యలను, పైలెట్‌ ప్రాజెక్టు అమల్లో గుర్తించిన అంశాలను అధికారులు వివరించారు.

 ఫ్యామిలీ డాక్టర్ పైలట్ ప్రాజెక్ట్

ఫ్యామిలీ డాక్టర్ పైలట్ ప్రాజెక్ట్

రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ పైలట్ ప్రాజెక్ట్ అమలవుతున్న తీరుపై సీఎం జగన్ ఇవాళ సమీక్షించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వైద్యారోగ్యశాఖ సమీక్షలో జగన్ పైలట్ ప్రాజెక్ట్ పై వివరాలు తెలుసుకున్నారు.

26 జిల్లాల్లో నెలరోజుల వ్యవధిలో 7166 విలేజ్‌ క్లినిక్స్‌లలో రెండుసార్లు చొప్పున,2866 విలేజ్‌ క్లినిక్స్‌లలో ఒకసారి చొప్పున ఫ్యామిలీ డాక్టర్‌ 104 వాహనంతో పాటు వెళ్లారని అధికారులు సీఎంకు తెలిపారు. డిసెంబర్‌లో అదనంగా మరో 260.. 104 వాహనాలు సమకూర్చుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. దీంతో పూర్తిస్థాయిలో 104 వాహనాలు అందుబాటులో ఉన్నట్టు అవుతుందన్నారు.

 నెలలో 7.86 లక్షల మందికి సేవలు

నెలలో 7.86 లక్షల మందికి సేవలు

ఫ్యామిలీ డాక్టర్ పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా నెలరోజుల వ్యవధిలో 7,86,226 మందికి సేవలందించామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతున్న 1,78,387 మందిని గుర్తించగా, 1,25,948 మంది మధుమేహంతో బాధపడుతున్నారన్నారు. వీరికి మందులు ఇస్తున్నట్లు తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ వల్ల వైద్య సిబ్బందిలో వివిధ విభాగాల మధ్య సమన్వయం, సమర్థత గణనీయంగా పెరిగాయన్నారు. సిబ్బంది భాగస్వామ్యం కూడా బాగా పెరిగిందని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు పాఠశాల విద్యార్థులు, అంగన్వాడీ పిల్లలు, గర్భవతుల ఆరోగ్యంపైన కూడా పరిశీలన చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఎనీమియాతో బాధపడుతున్న వారిని కూడా గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు.

 వైఎస్ జగన్ సూచనలు

వైఎస్ జగన్ సూచనలు

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లో క్రమం తప్పకుండా మందులు ఇవ్వడమే కాదు, వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న దానిపై సూచనలు కూడా ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. వైద్య సిబ్బంది ఈ విషయంలో పూర్తి మార్గదర్శకంగా ఉండాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి తగిన స్థాయిలో సన్నద్ధం కావాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అవసరాలకు తగిన విధంగా 104 వాహనాలను సమకూర్చుకోవాలన్నారు. ఎక్కడా ఖాళీలు లేకుండా సిబ్బందిని భర్తీచేయాలని కోరారు. ఆలోగా విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణాలను పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం జగన్ సూచించారు. ఉగాది కల్లా వీటిని పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలులో స్త్రీ శిశుసంక్షేమ శాఖను భాగస్వామ్యం చేయాలని కూడా సీఎం ఆదేశించారు.
పిల్లలు, గర్బవతులు, బాలింతల్లో ఎనీమియాతో బాధపడుతున్న వారిని గుర్తించి ఆ డేటాను స్త్రీ శిశుసంక్షేమశాఖకు బదిలీచేయాలన్నారు. డేటా ప్రకారం ఆయా లక్షణాలున్నవారికి పౌష్టికాహారం, మందులు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సందర్శనలో భాగంగా ఫ్యామిలీ డాక్టర్‌ ఆ గ్రామంలో మంచానికి పరిమితమైన రోగులను తప్పనిసరిగా కలవాలన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించాలని జగన్ కోరారు. ఆరోగ్యశాఖలోని ఆశా వర్కర్‌ స్ధాయి వరకూ కూడా ట్యాబులు లేదా సెల్‌ఫోన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇందులో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్యశ్రీ సహా వివిధ కార్యక్రమాలకు సంబంధించిన యాప్‌లు ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు.

 ఫ్యామిలీ డాక్టర్ పై పర్యవేక్షణ

ఫ్యామిలీ డాక్టర్ పై పర్యవేక్షణ

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ పర్యవేక్షణకు సమర్థ యంత్రాంగం ఉండాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, మండల స్థాయిలో ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను ఉంచాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటుకు కూడా జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఆరోగ్యరంగంలో ఎలాంటి ఫిర్యాదునైనా 104 ద్వారా స్వీకరించాలని, విలేజ్‌ క్లినిక్స్‌ సహా అన్నిచోట్లా ఈ నంబర్‌ను ఉంచాలని సీఎం ఆదేశించారు.
అలాగే ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కలిగించాలని జగన్ సూచించారు. ఏ వ్యాధికి ఏ ఆసుపత్రిలో చికిత్స లభిస్తుందన్నది బాధితులకు తెలియాలన్నారు. ఎవరికైనా ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించాలంటే.. సంబంధిత చికిత్సను అందించే నెట్వర్క్‌ ఆసుపత్రి వివరాలు వెంటనే తెలిసేలా యాప్‌ను రూపొందించాలన్నారు. సంబంధిత ఆసుపత్రి లొకేషన్‌తో పాటు డైరెక్షన్‌ కూడా చూపేలా ఈ యాప్‌ ఉండాలన్నారు. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు దగ్గర నుంచి కూడా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రి గురించి గైడ్‌ చేసే పరిస్థితి రావాలన్నారు. ప్రజలకు కూడా ఈ యాప్‌ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఆరోగ్య శ్రీసాప్ట్‌వేర్‌ కూడా బాగా మెరుగుపరచాలని సీఎం ఆదేశాలిచ్చారు.

ఎవరైనా తమకు వైద్యం కోసం ఎక్కడకు వెళ్లాలి? ఏ జబ్బుకు ఎక్కడ వైద్యం అందుతుంది? దీనికి ఆరోగ్య శ్రీ సేవలు ఎక్కడ అందుతాయి అన్నదానిపై లొకేషన్‌ సైతం తెలియజేసేలా యాప్‌లో వివరాలు ఉండాలన్నారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్‌ సంబంధిత గ్రామానికి వెళ్లినప్పుడు కూడా రియల్‌టైం డేటా కూడా రికార్డు చేయాలన్నారు. దీనివల్ల సిబ్బంది మధ్య సమన్వయం, వివిధ విభాగాలు తీసుకునే చర్యల మధ్య కూడా సమన్వయం చక్కగా కుదురుతుందన్నారు.

English summary
ap cm ys jagan on today issued key orders on family doctor concept in his review on medical and health department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X