మైండ్ గేమ్: అందుకోసం జగన్ వెయిటింగ్, బాబు దూకుడుకు చెక్ ఎలా?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నా అనుకూలించేలా ఓ కుదుపు కావాలని వైసిపి నేతలు చర్చించుకుంటున్నారని తెలుస్తోంది.

ఇల్లు, ఆఫీస్ ఒకేచోట: లోటస్‌పాండ్‌లా అమరావతిలోను వైసిపి ఆఫీస్

ఓ మంచి బ్రేక్ కావాల్సిందే

ఓ మంచి బ్రేక్ కావాల్సిందే

సినిమా పరిభాషలో చెప్పాలంటే, వైసిపికి ఇప్పుడు మంచి బ్రేక్ కావాలని పార్టీ నేతలు జోరుగా చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. టిడిపికి దెబ్బపడేలా మంచి కుదుపు కావాలని భావిస్తున్నారట. ఇటీవల నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

మంచి అస్త్రం కోసం వెయిటింగ్

మంచి అస్త్రం కోసం వెయిటింగ్

2019 ఎన్నికలకు నంద్యాల ఉప ఎన్నికలను సెమీ పైనల్‍‌గా భావించారు. అలాంటి ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత కాకినాడ దెబ్బతో వైసిపిలో నిస్తేజం అలుముకుంది. ప్రస్తుతం పార్టీలో ఉత్సాహం నింపాలన్నా, టిడిపిని దెబ్బతీయాలన్నా ఏదైనా మంచి అస్త్రం కావాలని భావిస్తున్నారట.

టిడిపిని దెబ్బతీయాలంటే

టిడిపిని దెబ్బతీయాలంటే

జగన్ పదేపదే రాజధానిలో అవినీతి, చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు.. అంటూ పాత పాటే పాడితే లాభం లేదని వైసిపి నేతలు చర్చించుకున్నారని తెలుస్తోంది. చంద్రబాబు, టిడిపి ఆత్మస్థైర్యం దెబ్బతీయాలన్నా.. పాతవి సరిపోవని, కొత్త అస్త్రం కావాలంటున్నారు.

పాతపాటే పాడుతారా?

పాతపాటే పాడుతారా?

అక్టోబర్ 27 నుంచి జగన్ పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్రలో జగన్ కొత్త అస్త్రాలు ఏమైనా ఉపయోగిస్తారా లేక పాతపాటే పాడుతారా అనే చర్చ కూడా వైసిపిలో సాగుతోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత టిడిపి దూకుడు పెంచింది. అంతేకాదు, వైసిపిపై గతంలో కంటే మైండ్ గేమ్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో టిడిపిపై మంచి అస్త్రంతో ఎదురుదాడి చేయాలంటున్నారు.

టిడిపి దూకుడుకు జగన్ అడ్డుకట్ట వేసేనా?

టిడిపి దూకుడుకు జగన్ అడ్డుకట్ట వేసేనా?

జగన్ లండన్ నుంచి వచ్చాక ఏం చేస్తారనే చర్చ కూడా వైసిపిలో సాగుతోంది. వైసిపి నేతలు తమతో టచ్‌లో ఉన్నారని, పదిమంది, పన్నెండు మంది.. ఇలా చాలామంది టచ్‌లో ఉన్నారని టిడిపి నేతలు చెబుతున్నారు. ఇది మైండ్ గేమ్‌గా వైసిపి భావిస్తోంది. జగన్ వచ్చాక టిడిపి దూకుడుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేయాలంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress has made the Nandhyal By-Election as a Semi-Final for 2019 Elections and is now struggling to break the image after it lost the election. It is a fact that Jagan himself blew the importance of a by-election into massive proportions.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి