జగన్ భారీ ప్లాన్, ఇక నేరుగా- ముహూర్తం, నియోజకవర్గాలు ఫిక్స్..!!

ఏపీలో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కూటమి నేతలు తామే 15 ఏళ్లు అధికారంలో ఉంటామని ధీమాగా చెబుతున్నారు. ఇటు మాజీ సీఎం జగన్ కూటమి పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని విమర్శిస్తున్నారు. దీంతో.. 2027 లో పాదయాత్ర కు డిసైడ్ అయిన జగన్.. ఈ లోగానే పార్టీ కేడర్ వద్దకే వెళ్లి మమేకం అవ్వాలని నిర్ణయించారు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటన కు ముహూర్తం పిక్స్ చేసారు.

మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల ఫలితాల విశ్లేషణలో పార్టీ కేడర్ తో నాయకత్వానికి వచ్చిన గ్యాప్ గురించి గుర్తించారు. దీంతో.. ప్రతీ సందర్భంలోనూ ఈ సారి పార్టీ కేడర్ కే తొలి ప్రాధాన్యత ఉంటుందని జగన్ చెబుతూ వస్తున్నారు. కాగా.. ఏ ఏడాది జనవరి నుంచే జగన్ జిల్లాల పర్యటనలు చేసి.. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో వారంలో రెండు రోజులు కేడర్ తో ఉంటానని ప్రకటించారు.

YS Jagan planning for districts tour to meet party cadre from Januaray details here

అయితే.. కూటమి ప్రభుత్వం ఏర్పడి అప్పటికి ఆరు నెలలే కావటం తో నిర్ణయం వాయిదా వేసుకున్నారు. ఇక.. ఇప్పుడు రానున్న జనవరి 26వ తేదీ నుంచి జగన్ జిల్లాల వారీగా బస్సు యాత్రకు సిద్దం అయినట్లు సమాచారం. ఈ బస్సు యాత్ర ద్వారా దాదాపు 60 నియోజకవర్గాల్లో జగన్ పార్టీ సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానిక ప్రజా సమస్యల పైన జగన్ స్పందించేలా కార్యక్రమం సిద్దం అవుతోంది.

ఇక.. 2029 ఎన్నికల కోసం జగన్ ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేస్తున్నారు. 2027 జూలై నుంచి పాదయాత్ర -2 కు సిద్దం అవుతున్నారు. ముందుగా పార్టీ కమిటీలు.. ఇంఛార్జ్ నియామకం పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. జనవరి నుంచి బస్సు యాత్రగా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో తొలి విడతగా కేడర్ తో సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానిక సమస్యలను తెలుసుకోవటం తో పాటుగా పార్టీలో కార్యకర్తల వాయిస్ వినిపించేందుకు వీలుగా కొత్త యాప్ ను ఆవిష్కరించేలా తాజా గా కసరత్తు ప్రారంభించారు.

దాదాపు నాలుగు నెలల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. జూలై లో పార్టీ ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ యాత్ర ద్వారా పార్టీ కేడర్ కు తిరిగి జగన్ దగ్గర కావటంతో పాటుగా స్థానికంగా ఉన్న వివిధ వర్గాల వారితోనూ సమావేశాలు నిర్వహించనున్నారు. దీని ద్వారా కేడర్ ను స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేయటం.. స్థానికంగా పార్టీని బలో పేతం చేయటమే లక్ష్యంగా జగన్ సమావేశాలకు సిద్దం అవుతున్నారు. ఈ నిర్ణయం రాజకీయంగా కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+