ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రకాశం: వైవీతో విబేధాలే కారణమా, జగన్‌తో బూచేపల్లి ఫ్యామిలీ భేటీ?

2019 ఎన్నికల కోసం వైసీపీ నాయకత్వం ఇప్పటి నుండే ప్లాన్ చేస్తోంది. ఏ అభ్యర్థి ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దింపాలనే విషయమై పార్టీ నాయకత్వం ఆరా తీస్తోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: 2019 ఎన్నికల కోసం వైసీపీ నాయకత్వం ఇప్పటి నుండే ప్లాన్ చేస్తోంది. ఏ అభ్యర్థి ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దింపాలనే విషయమై పార్టీ నాయకత్వం ఆరా తీస్తోంది. బలమైన అభ్యర్థుల కోసం వైసీపీ అన్వేషణ కొనసాగిస్తోంది.దర్శి నియోజకర్గంలో బూచేపల్లి కుటుంబానికి ప్రత్యామ్నాయంగా ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై వైసీపీ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది.

జగన్‌కు షాక్: బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఫ్యామిలీ రాజకీయాలకు గుడ్‌బై?జగన్‌కు షాక్: బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఫ్యామిలీ రాజకీయాలకు గుడ్‌బై?


ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కుటుంబం నిర్ణయం తీసుకొందని కొంత కాలంగా ప్రచారంలో ఉంది. ఈ విషయాన్ని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు కూడ చెప్పారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కుటుంబం నుండి స్పష్టత రావాల్సి ఉంది.

అయితే దర్శి నియోజకవర్గం నుండి ఎవరిని అభ్యర్థిగా వైసీపీ దింపనుందనే విషయమై ప్రకాశం జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. వైసీపీ నాయకత్వం దృష్టిలో ఇప్పటికే రెండు మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయనే ప్రచారం కూడ ఉంది.

ప్రకాశం జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడ వైసీపీ నాయకత్వం వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ సాగిస్తోంది. పార్టీని వీడిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడ ప్రత్యామ్నాయాలను వెతుకుతోంది.

దర్శిలో వైసీపీ అభ్యర్థిగా మాధవరెడ్డి పోటీ?

దర్శిలో వైసీపీ అభ్యర్థిగా మాధవరెడ్డి పోటీ?

ఒకవేళ దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కుటుంబం నుండి ఎవరూ కూడ బరిలోకి దిగకపోతే
ప్రస్తుతానికి తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని బాదం మాధవరెడ్డి వైసీపీ నాయకత్వానికి సంకేతాలు పంపారని ప్రచారం సాగుతోంది. సౌమ్యుడిగా, పార్టీకి విధేయుడిగా మాధవరెడ్డికి పేరుంది. బాలినేని, వైవీలతోపాటు జగన్‌తోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. బూచేపల్లి కుటుంబ సభ్యులు పోటీ చేయబోమని చెప్పిన వెంటనే మాధవరెడ్డి పేరును జగన్‌ ఉదహరించడం అందుకు నిదర్శనం. తదనుగుణంగా మాధవరెడ్డి అధిష్ఠానంలోని కొందరు ముఖ్యులతో టచ్‌లో ఉన్నట్లు తెలిసింది.

జగన్‌తో సమావేశమైన బూచేపల్లి ఫ్యామిలీ

జగన్‌తో సమావేశమైన బూచేపల్లి ఫ్యామిలీ

కొంతకాలం క్రితం వైసీపీ చీఫ్ జగన్‌ను బూచేపల్లి కుటుంబ సభ్యులు కలిసి వివిధ కారణాలతో వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయలేమని చెప్పారు. ఇందుకు జగన్ కూడ సానుకూలంగా స్పందించారనే ప్రచారంలో ఉంది. అయితే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జోక్యంతో కుదుటపడిన బూచేపల్లి కుటుంబ సభ్యులు శనివారం మళ్లీ జగన్‌ను కలిశారని సమాచారం.గతానికి భిన్నంగా ఈ పర్యా యం జగన్‌ మరోసారి ఆలోచించుకోవాలని వారిని కోరడం, ప్రత్యామ్నాయంగా మీరే ఒకరిని సూచించండని కోరారు.బూచేపల్లి కుటుంబ సభ్యులు పార్టీ వీడబోమని, అభ్యర్థి గెలుపునకు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారంటున్నారు.

వైవీ సుబ్బారెడ్డితో పొసగలేదా?

వైవీ సుబ్బారెడ్డితో పొసగలేదా?

ఒంగోలు ఎంపీ వై.వీ. సుబ్బారెడ్డితో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కుటుంబానికి మధ్య విబేధాలున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే బూచేపల్లి ఫ్యామిలీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలనే అభిప్రాయంతో ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ విషయమై వైసీపీ చీఫ్ జగన్‌కు కూడ బూచేపల్లి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారంటున్నారు. కానీ, ఈ ప్రచారాన్ని బూచేపల్లి శిప్రసాద్‌రెడ్డి ఫ్యామిలీ కొట్టిపారేస్తోంది. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనే ప్రచారంపై కూడ బూచేపల్లి కుటుంబం అధికారికంగా స్పందించలేదు.

పోటీకి సిద్దమంటున్న నేతలు

పోటీకి సిద్దమంటున్న నేతలు

ప్రకాశం జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి వచ్చే ఎన్నికల్లో పోటీకి తాము సిద్దంగా ఉన్నామంటూ కొందరు నేతలు పార్టీ నాయకత్వానికి సంకేతాలు పంపుతున్నారు. దర్శి నుండి బూచేపల్లి కుటుంబం పోటీకి దూరమైతే బాదం మాధవరెడ్డి పోటీకి సిద్దంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారని సమాచారం.గిద్దలూరు నియోజకవర్గం నుంచి తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని ముందుకు వచ్చిన మాజీ శాసనసభ్యురాలు పిడతల సాయికల్పనారెడ్డితో అధిష్ఠానం చర్చలు జరిపినట్టు సమాచారం.సంతనూతలపాడు నియోజకవర్గంపై కూడా అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆదిమూలపు సురే్‌షను ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి బా ధ్యులుగా నియమించారు. దీంతో సంతనూతలపాడు ప్రత్యామ్నాయ అభ్యర్థిపై తర్జనల భర్జనల అనంతరం సామాన్యకిరణ్‌ను నియమించారు. గత ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఆమె ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి పోటీకి సిద్ధమైన ఆమె ఇటీవల నియోజకవర్గంలోని ముఖ్య నాయకులను కలవడం ప్రారంభించారు.

English summary
Ysrcp planning to choose candidates for contest in 2019 election from prakasham district.ysrcp chief ordered to district leadership strengthen party in various assembly segments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X