ఉపఎన్నిక: నంద్యాలపై జగన్ జాగ్రత్త, ఆ నేతకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్!
నంద్యాల ఉప ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వలేదని కొంత అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డికి వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వలేదని కొంత అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డికి వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఈ మేరకు త్వరలో నంద్యాలలో పర్యటించినప్పుడు ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అతనిని పార్టీ కార్యవర్గంలోకి తీసుకున్నారు. అతనికి మొదటి ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వాలని కూడా జగన్ భావిస్తున్నారు.
భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరిన తర్వాత రాజగోపాల్ రెడ్డి నంద్యాల ఇంచార్జిగా ఉన్నారు. నాగిరెడ్డి మృతి అనంతరం ఉప ఎన్నికల్లో తనకు టిక్కెట్ వస్తుందని రాజగోపాల్ రెడ్డి భావించారు. కానీ శిల్పా మోహన్ రెడ్డిని పార్టీలోకి తీసుకొని, ఆయనకు టిక్కెట్ ఇచ్చారు జగన్.

దీంతో రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. ఆయనకు పార్టీలో బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ రాజగోపాల్ రెడ్డి కొంత అసంతృప్తితోనే ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఉప ఎన్నికల్లో మౌనంగా ఉండకుండా లేదా వ్యతిరేకంగా పని చేయకుండా ఉండేందుకు రాజగోపాల్‌కు మొదటి ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా నష్టం జరగకుండా ఇరు పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి.












Click it and Unblock the Notifications