ఎవడు కొడితే బాబు దిమ్మ తిరుగుతుందో: ఊగిపోయిన రోజా, సిగ్గుందా అని అఖిలప్రియను
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై, టిడిపిపై వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిడిపి, అఖిలప్రియపై ఊగిపోయారు. అదే సమయంలో మంత్రి అఖిలప్రియకు సవాల్ విసిరారు.
నంద్యాల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై, టిడిపిపై వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిడిపి, అఖిలప్రియపై ఊగిపోయారు. అదే సమయంలో మంత్రి అఖిలప్రియకు సవాల్ విసిరారు.

ఇక్కడ ఉన్నది ఎవరు.. జగనన్న
నంద్యాల సమీపంలో నల్ల కాలువ వద్ద వైయస్ రాజశేఖర రెడ్డి ప్రాణాలు వదిలిన రోజున మనం మరోసారి గుర్తు చేసుకోవాలని రోజా అన్నారు. తన తండ్రి కోసం మరణించిన వారికి అండగా ఉండానని జగన్ నల్ల కాలువ వద్ద చెప్పారని, అందు కోసం ఈ రోజు వరకు పోరాడుతున్నారన్నారు. అన్ని పార్టీలు కక్ష కట్టి జగన్‌ను జైలుకు పంపించాయని, ఆయన కుటుంబాన్ని వేధించాయన్నారు. కానీ ఏం జరిగింది... అక్కడ ఉన్నది జగనన్న అని, రాయలసీమ ముద్దుబిడ్డ అన్నారు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన మాట తప్పలేదు, మడమ తిప్పలేదన్నారు.
Recommended Video


భూమా గుండెపోటుకు చంద్రబాబు కారణం
నంద్యాల ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయో అందరూ ఓసారి గుర్తుంచుకోవాలని రోజా అన్నారు. చంద్రబాబు 21 మంది ఎమ్మెల్యేలను పశువుల్లా కొన్నారన్నారు. మంత్రి పదవి వస్తుందనే ఆశతో భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరితే, ఆయనకు పదవి ఇవ్వకుండా గుండెపోటు వచ్చేలా చంద్రబాబు చేశారన్నారు. దీంతో ఎన్నికలు వచ్చాయన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. నంద్యాల గడ్డ వైయస్ రాజశేఖర రెడ్డి అడ్డా అన్నారు. వైయస్ పాలన చూసి నంద్యాల ప్రజలు అభ్యర్థులను గెలిపించారన్నారు.

నంద్యాల ప్రజల వద్ద బ్రహ్మాస్త్రం
నంద్యాల గడ్డ చంద్రబాబుకు అబ్బా అనేలా ఉండాలని రోజా అన్నారు. 2014లో చంద్రబాబుకు ఓటు వేసి, గెలిపించి మూడేళ్లుగా దగాపడ్డామన్నారు. అరాచకానికి, వెన్నుపోటుకు చంద్రబాబు ట్రంప్ కార్డ్ అన్నారు. ఇప్పుడు నంద్యాల ప్రజల వద్ద ఉన్న బ్రహ్మాస్త్రం ఓటు అన్నారు.

ఎవడు కొడితే చంద్రబాబు దిమ్మ తిరుగుతుందో వాడే
ఎవడు కొడితే చంద్రబాబు దిమ్మతిరుగుతుందే వాడే నంద్యాల ఓటరు అన్నారు. మాహిష్మతి సామ్రాజ్యం ఎప్పుడూ బాహుబలిదే అని, నంద్యాల గడ్డ ఎప్పుడూ జగన్‌దే అన్నారు. అడుగడుగునా కష్టాలు అనుభవిస్తున్న జగన్‌కు వైసిపిని గెలిపించి మద్దతుగా నిలుద్దామన్నారు.

సిగ్గులేకుండా: అఖిలప్రియపై రోజా
వైసిపి నుంచి వెళ్లి మంత్రి పదవులు అనుభవిస్తున్న వారు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మంత్రి అఖిలప్రియను ఉద్దేశించి రోజా అన్నారు. రాజీనామా చేసి, ఆ తర్వాత గెలిచి మాట్లాడాలన్నారు. ఇష్టారీతిన మాట్లాడితే వారికి అప్ అడ్ డౌన్ అదిరిపోతుందన్నారు.

టిడిపికి ఓటు వేస్తే వీటికి ఓటేసినట్లే
ఈ రోజు నేను టిడిపిని అడుగుతున్నానని, చంద్రబాబుకు ఎందుకు ఓటేయాలన్నారు. రైతులను, డ్వాక్రా మహిళలను, అందర్నీ మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. టిడిపికి ఓటేస్తే రాజధాని రైతులకు వ్యతిరేకంగా, విశాఖ భూకుంభకోణానికి అనుకూలంగా ఓటు వేసినట్లే అన్నారు. రౌడీయిజం, అరాచకానికి ఓటు వేసినట్లు అవుతుందన్నారు.

రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఉప ఎన్నిక, టిడిపికి చెక్
ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తును మార్చే అవకాశం నంద్యాల ప్రజలకు వచ్చిందన్నారు. నంద్యాల ఎన్నికలు ఐదు కోట్ల ప్రజల తలరాతను మార్చే ఎన్నికలు అన్నారు. అందరూ ఎదురు చూస్తున్న ఉప ఎన్నిక అన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న టిడిపికి చెక్ పెట్టాలన్నారు.












Click it and Unblock the Notifications