ఎదురు కేసులా: టిడిపి నేతలపై విరుచుకుపడ్డ జగన్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై దాడులు చేయడం పరిపాటిగా మారిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దాడిలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ పార్టీ కార్యకర్త పుట్టా దస్తగిరి రెడ్డిని ఆయన బుధవారంనాడు పరామర్శించారు.

దస్తగిరి రెడ్డిపై టిడిపి నాయకులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఎన్నిసార్లు ప్రశ్నించినా, ఎంతగా ఒత్తిడి చేసినా స్పందన లేదని ఆయన న్నారు. జరుగుతున్న అరాచాకాలపై కేసులు పెడుదామంటే తీసుకునే పరిస్థితి కూడా లేదని ఆయన అన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ నేతలే దాడులు చేసినవాళ్లే ఎదురు కేసులు పెడుతున్నారని, ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా అని జగన్ అన్నారు.

YS Jagan questions Chandrababu government on attacks

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఎంవి మైసురా రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాలనలో రాజ్యాంగేతర శక్తుల జోక్యం ఎక్కువైందని, దాడులు చేసిన ముద్దాయిలే మళ్లీ కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని ఆయన అన్నారు.

ల్యాండ్ పూలింగ్‌పై వామపక్షాల భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం ప్రభుత్వం తలపెట్టిన ల్యాండ్ పూలింగ్‌పై వామపక్షాలు బుధవారం విజయవాడలో సమావేశమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రకటనను ఏకపక్షంగా చేసిందని కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని వారు అభిప్రాయపడ్డారు. రైతులకు నష్టపరిహారం ఎగగొట్టడానికే ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అనుసరిస్తోందని వారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+