ఈవీఎంలపై దేశవ్యాప్తంగా ఆందోళన- రాజ్యాంగ దినోత్సవం వేళ జగన్ కీలక ట్వీట్..!
ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యాక అందుకు కారణాల్ని వెతికే క్రమంలో ఈవీఎం పనితీరుపై తొలిసారి ప్రశ్నలు వేయడం మొదలుపెట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్ దాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరోసారి ఈవీఎంల పనితీరుపై ప్రశ్నలు, బ్యాలట్ పేపర్ల వాడకాన్ని గుర్తుచేస్తూ జగన్ ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఇందులో దేశవ్యాప్తంగా ఈవీఎంలపై ఆందోళన పెరుగుతోందన్నారు.
మన సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య రిపబ్లిక్ మనకు న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుందని జగన్ తెలిపారు. మనం 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు, దాని ప్రాముఖ్యతను ప్రతిబింబించాలని, దాని మార్గదర్శక సూత్రాలకు మన అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటిద్దామని జగన్ పిలుపునిచ్చారు.
అదే సమయంలో ఈవీఎల పనితీరును జగన్ ప్రశ్నించారు.

ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్న ఆందోళన ఈవీఎంల యొక్క వాస్తవికతను ప్రశ్నించడానికి,, ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో ఉన్న పద్ధతిలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు ఎందుకు వెళ్లకూడదని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలని కోరారు.
Our Sovereign, Socialist , Secular, Democratic Republic guarantees us Justice, Equality, Liberty, and Fraternity. As we celebrate the 75th Constitution Day, let us reflect on its significance and reaffirm our unwavering commitment to its guiding principles.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 26, 2024
The cornerstone of…
ఇటీవలి కాలంలో మన దేశ పౌరులకు హామీ ఇచ్చిన అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేయడానికి దూకుడుగా జరుగుతున్న ప్రయత్నాలూ ఆందోళన కలిగిస్తున్నాయని జగన్ తెలిపారు. ఈ పవిత్రమైన రోజున డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, మన రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శనిక నాయకులు, ఏకీకృత, సమాన భారతదేశం వైపు నడిపించారంటూ జగన్ గుర్తుచేసుకున్నారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications