విజయనగరం రైలు ప్రమాదంపై వైఎస్ జగన్ అనుమానాలు-మోడీ, రైల్వే మంత్రికి వినతి..
నిన్న రాత్రి విజయనగరం జిల్లాలోని కంటకపల్లె వద్ద జరిగిన రైళ్ల ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఇవాళ ప్రమాద స్ధలి వద్ద ఏరియల్ సర్వే నిర్వహించిన వైఎస్ జగన్.. అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రులకు వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికే 10 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించింది. ఇవాళ ఆస్పత్రుల్లో క్షతగాత్రుల పరామర్శ తర్వాత సీఎం జగన్ ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
The devastating train accident that occurred in Vijayanagaram district last night has caused me great pain.
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 30, 2023
A running train collided with another stationed train, both of which were running in the same direction.
This horrifying accident gives rise to certain obvious questions:…
నిన్న రాత్రి విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తనను చాలా బాధించిందని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ లో తెలిపారు. ఓ రైలు రన్నింగ్‌లో ఉన్న మరో రైలును ఢీకొట్టిందని, రెండూ ఒకే దిశలో నడుస్తున్నాయని తెలిపారు. ఈ భయంకరమైన ప్రమాదం కొన్ని ప్రశ్నలకు కారణమవుతోందన్నారు. ఇందులో 1. బ్రేకింగ్ సిస్టమ్ మరియు అలర్ట్ సిస్టమ్ ఎందుకు పని చేయలేదు? 2. సిగ్నలింగ్ ఎందుకు విఫలమైంది? 3. కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా విఫలమైంది? అని జగన్ ప్రశ్నలు సంధించారు.

అలాగే ప్రధాని మోడీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఉద్దేశించి.. భవిష్యత్తులో ఇలాంటి విధ్వంసకర ప్రమాదాలు పునరావృతం కాకుండా చూసేందుకు, ఈ లైన్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని మార్గాల్లో ఈ అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఒక ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ కోరారు. తన ఆలోచనలు మరియు ప్రార్థనలు వారి ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలతో ఉన్నాయన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణ అందించేలా మా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications