భారీ కాన్వాయ్‌తో కాకినాడకు జగన్, టిడిపికి నష్టం.. బాబుపై వీర్రాజు అసంతృప్తి
కాకినాడ నగర పాలక ఎన్నికలలో వైసిపి అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించేందుకు వైసిపి అధినేత జగన్ ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వచ్చారు.
కాకినాడ: కాకినాడ నగర పాలక ఎన్నికలలో వైసిపి అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించేందుకు వైసిపి అధినేత జగన్ ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వచ్చారు.

జగన్‌కు ఘన స్వాగతం
జగన్‌కు తూర్పు గోదావరి జిల్లా పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన జగన్, భారీ కాన్వాయ్‌తో సహా కాకినాడకు బయలుదేరారు. ఈ ఎన్నికల్లో ప్రచారానికి ఆదివారంతో గడువు ముగియనుంది.

ఐదు గంటల దాకా జగన్ ప్రచారం
రాజమహేంద్రవరంలో జగన్ ఎక్కువ సేపు గడపలేదు. తనను పలకరించేందుకు వచ్చిన పార్టీ నేతలతో కూడా జగన్ ఎక్కువ సేపు మాట్లాడలేదు. జగన్ సాయంత్రం 5 గంటల వరకూ ప్రచారం నిర్వహించనున్నారు. జగన్ ప్రచారం సినిమా హాల్స్ రోడ్డు, కల్పనా సెంటర్ తదితర ప్రాంతాల్లో సాగనుంది.

నంద్యాల ఉప ఎన్నికలకు ఆహ్వానం లేదు
నంద్యాల ఉప ఎన్నికలకు అధికార టిడిపి నుంచి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని బిజెపి నేత సోము వీర్రాజు ఆదివారం చెప్పారు. అందుకే ప్రచారంలో పాల్గొనలేదన్నారు. కాకినాడ మున్సిపల్ ఎన్నికల అంశంపై కూడా ఆయన మాట్లాడారు.

మిత్రధర్మం పాటించని టిడిపి
బిజెపి నేతలు పోటీ చేస్తున్న చోట టిడిపి రెబల్స్ పోటీ చేస్తున్నారని సోము వీర్రాజు అన్నారు. తద్వారా టిడిపి మిత్రధర్మాన్ని పాటించడం లేదన్నారు. మేం పోటీ చేసే చోట రెబల్స్‌గా ఎలా పోటీ చేస్తారన్నారు. చంద్రబాబు మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పొంతన లేదన్నారు. ఈ విషయాన్ని టిడిపి అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.

టిడిపికీ నష్టమే
బిజెపి పోటీ చేస్తున్న చోట టిడిపి రెబల్స్ పోటీ చేస్తే తామిద్దరం ఎవరూ గెలవక వైసిపి గెలుస్తుందని, అప్పుడు టిడిపికి లాభం జరగదని సోము వీర్రాజు అన్నారు. మేం గెలిస్తే టిడిపి అభ్యర్థి మేయర్ పదవికి తమ సహకారం అవసరమవుతుందన్నారు. వైసిపి గెలిస్తే టిడిపికి నష్టమే అన్నారు. ఈ పరిస్థితి తమ హైకమాండ్ దృష్టిలో ఉందని, తదుపరి పొత్తు విషయంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications