భారీ కాన్వాయ్‌తో నంద్యాలకు జగన్, కర్నూల్లో గౌరు ఇంట భోజనం
నంద్యాల: వైసిపి అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి నంద్యాల బయలుదేరారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఎస్పీజీ మైదానంలో బహిరంగ సభ ఉంది.
నంద్యాల వెళ్తున్న జగన్ కర్నూలులో భోజన విరామం కోసం ఆగారు. పార్టీ నేత గౌరు వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడే భోజనం చేస్తారు. అనంతరం నంద్యాలకు బయలుదేరుతారు.

హైదరాబాద్ నుంచి జగన్ వెంట భారీ కాన్వాయ్ నంద్యాలకు వెళుతుండగా, వీరందరికీ వెంకట్ రెడ్డి భోజన ఏర్పాట్లను చేసినట్టు పార్టీ ప్రతినిధులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications