Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ కు లీకుల తలనొప్పి-ఆర్ధికశాఖ ఉద్యోగులపై చర్యలతో ఆగని వైనం-ఇక వాటికీ బ్రేక్

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారీ ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా ఖజానా ఖాళీ అయిపోయింది. ఎప్పటికప్పుడు రూపాయివస్తే దాన్ని ఎలా ఖర్చుపెట్టాలనే దానిపై ఆరునెలల ముందే ప్రణాళికలు వేసుకోవాల్సిన పరిస్దితి ఎదురవుతోంది. ఇలాంటి సమయంలో రుణాల కోసం పెద్ద ఎత్తున ప్రత్యక్ష, పరోక్ష, రహస్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి కాస్తా విపక్షాలకు చేరడంతో వీటిని వాడుకుంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. దీంతో లీకులకు కారణమని భావించి ఆర్దికశాఖలోని పలువురు ఉద్యోగులపై వేటు వేసిన సర్కార్ కు ఇప్పటికీ అవి ఆగకపోవడం మరింత తలనొప్పిగా మారింది.

 జగన్ సర్కార్ దివాళా

జగన్ సర్కార్ దివాళా

ఏపీలో వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఖజనాను ఎప్పుడో ఖాళీ డబ్బాగా మార్చేశాయి. దీంతో రుణాల కోసం నిరంతరం వేట కొనసాగిస్తోంది. సంక్షేమ పథకాలు ఆగితే చెడ్డపేరు వస్తుందన్న ఆలోచనతో ప్రభుత్వం భారీ ఎత్తున రుణాల కోసం ప్రయత్నిస్తోంది. అభివృద్ధికి ఇచ్చే నిధులన్నీ ఆపి మరీ సంక్షేమం కోసం ఖర్చు పెడుతోంది. ఈ నిధుల కోసం ప్రభుత్వం ఇప్పటివరకూ చేయని ప్రయత్నం లేదు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రుణాల కోసం జగన్ సర్కార్ వేట కొనసాగిస్తోంది. అయినా ఇప్పటికీ రుణాలు దొరికే పరిస్దితి కనిపించడం లేదు.

 జగన్ సర్కారు లో లీకుల గోల

జగన్ సర్కారు లో లీకుల గోల

ఓవైపు భారీ ఎత్తున రుణాల కోసం అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్న జగన్ సర్కార్ కు మరోవైపు ఈ ప్రయత్నాలు కాస్తా లీక్ కావడం సమస్యలు సృష్టిస్తోంది. ఈ లీకుల్ని పట్టుకుని విపక్షాలు తమకు సహకరించే మీడియా సంస్ధల సాయంతో ప్రభుత్వాన్ని ఆటాడుకుంటున్నాయి. దీంతో ఈ లీకులకు వెంటనే అడ్డుకట్ట వేయక తప్పని పరిస్ధితి ఎదురైంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం లీకులకు కారణమని భావిస్తున్న ఆర్ధిక శాఖ ఉద్యోగులతో పాటు కొందరు ఔట్ సోర్సింగా్ సిబ్బందిపైనా వేటు వేసేసింది. ప్రభుత్వ వ్యవహారాల్ని విపక్షాలకు లీక్ చేస్తున్నారంటూ వీరిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే విచిత్రంగా వీరిపై సస్పెన్షన్ వేటు పడినా లీకులు మాత్రం ఆగడం లేదు.

 అయినా ఆగని లీకులు

అయినా ఆగని లీకులు

ఆర్ధిక శాఖలో కొందరు ఉద్యోగులపై వేటు వేసి ఇక లీకులు ఆగిపోతాయని ధీమాగా ఉన్న ప్రభుత్వానికి తాజాగా బయటపడుతున్న మరిన్ని లీకులు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా వీటిని పట్టుకుని విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం మరింత ఇబ్బందిగా మారుతోంది. దీంతో సీఎం జగన్ వీటిపై మరింత సీరియస్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ తాజా లీకులకు కారకులు ఎవరన్న దానిపై ప్రభుత్వ శాఖల్ని జల్లెడపడుతున్నారు. త్వరలో ఈ తాజా లీకువీరుల్ని కూడా పట్టుకునేందుకు ప్రభుత్వం తమ వద్ద ఉన్న అన్ని ఆప్షన్స్ లను వాడుకుంటోంది. ఇందుకోసం తాజాగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఇది కూడా ప్రభుత్వంలో చర్చనీయాంశంగా మారింది.

Recommended Video

    5.1 తీవ్రతతో Earthquake.. AP, Tamil Nadu లోని పలు ప్రాంతాల్లో కంపించిన భూమి..! || Oneindia Telugu
     పీపీటీలపై జగన్ సర్కార్ నిషేధం

    పీపీటీలపై జగన్ సర్కార్ నిషేధం

    అధికారులు తమ శాఖలకు సంబంధించిన సమీక్షల సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు (పీపీటీ) ఇస్తుంటారు. ఇవి అందరికీ సులువుగా విషయం అర్ధమయ్యేలా చేస్తుంటాయి, జాతీయ, అంతర్జాతీయ నేతలకు, అధికారులకు ఈ పీపీటీలు చాలా సులువుగా విషయాన్ని చేరవేస్తాయి. అలాగే అధికారులు సీఎంవోతో నిర్వహించే సమీక్షల్లోనూ ఈ పీపీటీలను విరివిగా వాడుతుంటారు. కానీ ఇప్పుడు ఆ పీపీటీలే జగన్ సర్కార్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయి.ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి వివరాలు ఇవ్వకపోయినా పీపీటీల ద్వారా ప్రభుత్వ సమాచారం విపక్షాలకు చేరిపోతోంది. దీంతో విపక్షాలు వీటిని తమకు అనుకూలంగా వాడేసుకుంటున్నాయి. దీంతో ఇకపై అధికారులు తాము పీపీటీలు బహిరంగంగా ప్రదర్శించడం, విడుదల చేయడం మానేయాలని ఆదేశాలు అందాయి. అధికారులు సీఎంవోకు చెప్పదల్చుకున్న అంశాలను నేరుగా అందజేయాలని, సమావేశాల్లో మాత్రం పీపీటీలు ప్రదర్శించవద్దని సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల అయినా లీకులు ఆగుతాయోమో చూడాల్సి ఉంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+