ఆర్డినెన్స్ ఆమోదం: యూపీఏదేనన్న జగన్, బాబువల్లే...
న్యూఢిల్లీ: పోలవరం ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం అంశంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం స్పందించారు. భారతీయ జనతా పార్టీ లోకసభలో ప్రవేశ పెట్టిన పోలవరం ఆర్డినెన్స్‌లో కొత్తదనమేం లేదన్నారు. యూపిఏ నిర్ణయాన్నే బీజేపీ అమలు చేసిందని వ్యాఖ్యానించారు.
గుత్తా నిరసన
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై లోకసభలో చర్చ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుపై తీవ్ర గందరగోళం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ... గిరిజన ప్రాంత ప్రజలకు అన్యాయం చేసే విధంగా పోలవరం బిల్లు ఉందన్నారు.

దానిని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా ఆమోదించాలనుకోవడం సరికాదన్నారు. వెంటనే పోలవరం డిజైన్ మార్చాలని, బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
యనమల హర్షం
లోకసభలో పోలవరం బిల్లు ఆమోదం పొందడంపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు హర్షం వ్యక్తం చేశారు. దీంతో పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు ఉండవన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వల్లే పోలవరం ఆర్డినెన్స్ బిల్లు రూపం దాల్చిందని చెప్పారు. మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications