పులివెందుల బస్ టెర్మినల్ ప్రారంభించిన జగన్-చంద్రబాబు నెగెటివ్ ప్రచారంపై ఫైర్..
క్రిస్మిస్ సందర్భంగా మూడు రోజుల పర్యటన కోసం సొంత జిల్లా వైఎస్సార్ కు వెళ్లిన సీఎం జగన్.. ఇవాళ రెండో రోజు సొంత నియోజకవర్గం పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా పులివెందుల బస్ టెర్మినల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్.. చంద్రబాబు,ఎల్లో మీడియాపై పలు విమర్శలు చేశారు.
పులివెందుల బస్ టెర్మినల్ ను రాష్ట్రంలో మిగిలిన బస్టాండ్లకు రోల్ మోడల్ గా అభివృద్ధి చేసినా చంద్రబాబు, ఆయనకు మద్దతిస్తున్న మీడియా సంస్ధలు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన పనులు కళ్లకు కనిపిస్తున్నా చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియా కలిసి నెగెటివ్ ప్రచారం చేస్తున్నాయని జగన్ ఆరోపించారు. అలాంటి చెడిపోయిన వ్యవస్ధతో తాము యుద్ధం చేస్తున్నట్లు సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా చంద్రబాబు తీరుపై జగన్ తీవ్రవిమర్శలు చేశారు.

గత టీడీపీ ప్రభుత్వ హయానికీ, ఇప్పుడు వైసీపీ హయానికీ మధ్య బడ్జెట్ లో ఎలాంటి తేడా లేకున్నా తాము భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, చంద్రబాబు ఇదే బడ్జెట్ తో ఇవే పనులు ఎందుకు చేయలేకపోయారని జగన్ ప్రశ్నించారు. గ్లాసులో 75 శాతం నీళ్లున్నా అసలు నీళ్లే లేవని ప్రచారం చేయడం చంద్రబాబుకే చెల్లిందని జగన్ విమర్శించారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే పులివెందులలో అభివృద్ధి వేగం పుంజుకుందని జగన్ తెలిపారు. పులివెందుల స్పోర్ట్స్ కాంప్లెక్స్ వచ్చే ఏడాది కల్లా పూర్తవుతుందన్నారు.
ప్రారంభానికి సిద్ధమవుతున్న పులివెందులలోని డాక్టర్ వైయస్ఆర్ బస్ టెర్మినల్ (బస్ స్టాండ్)#Pulivendula #DrYSRBusTerminal pic.twitter.com/mq7uEYH6Di
— YSR Congress Party (@YSRCParty) December 23, 2022












Click it and Unblock the Notifications