వర్షాలు, వరదలతో ఏపీ అల్లకల్లోలం-జగన్ సమీక్ష-4 జిల్లాలకు రూ.8 కోట్ల తక్షణ సాయం
అమరావతి: ఏపీలో భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వైయస్.జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇందలుో భారీ వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల్లో తాజా పరిస్థితి, తీసుకుంటున్న సహాయ చర్యలను సీఎంకు కలెక్టర్లు వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు ఆదేశాలు ఇచ్చారు. అలాగే తక్షణ సాయం కూడా ప్రకటించార.

ధవళేశ్వరంలో వరదపై జగన్
ఈ ఏడాది గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయని, గడిచిన వందేళ్లలో ఇంత ముందుగా ఈ స్ధాయిలో వరద రాలేదని సీఎం జగన్ తెలిపారు. సాధారణంగా ఆగష్టులో 10 లక్షల క్యూసెక్కుల వరదనీరు ఉంటుందని, అయితే తొలిసారిగా జులై మాసంలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద వచ్చిందన్నారు. ఇది జాగ్రత్త పడాల్సిన అంశమన్నారు.
ప్రస్తుతం ధవళేశ్వరంలో 13 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోందని, ఇప్పడు రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందన్నారు. రేపు ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని సీఎం జగన్ తెలిపారు.ఇది 15 నుంచి 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందన్నారు. దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.

అధికారులకు కీలక ఆదేశాలు
మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరినదికి వరదలు కొనసాగే అవకాశం ఉందని సీఎం జగన్ తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ కూడా మృత్యువాత పడకూడదని జగన్ సూచించారు. కూనవరం, చింతూరుల్లో 2 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయన్నారు.
వి.ఆర్.పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో 4 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయని, లైన్ డిపార్ట్‌మెంట్లు ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలన్నారు. కంట్రోలు రూమ్స్ సమర్థవంతంగా పనిచేయాలన్నారు.24 గంటలపాటు నిరంతరాయంగా కంట్రోల్ రూంలు పనిచేయాలన్నారు.

ప్రజలే ముఖ్యం
వరదల నేపథ్యంలో అవసరమైనచోట వరద సహాయక శిబిరాలు తెరవాలని సీఎం జగన్ సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని వెంటనే శిబిరాలకు తరలించాలన్నారు. సహాయ శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలన్నారు. మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్నారు.
బాధితుల పట్ల మానవతాదృక్ఫధంతో మెలగాలని జగన్ సూచించారు. శిబిరాల నుంచి వాళ్ల వాళ్ల ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రశంసించే విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. సహాయ శిబిరాల్లో నాణ్యమైన సేవలందించే క్రమంలో ఖర్చుకు వెనుకాడొద్దని జగన్ ఆధేశించారు.. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు వ్యక్తికి అయితే రూ.1000, ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలని కోరారు. తక్షణ సహాయంగా వారికి ఉపయోగపడుతుందన్నారు.

ఆరోగ్య జాగ్రత్తలపై జగన్
పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉండాలని జగన్ సూచించారు. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిత్యావసర సరుకులకు సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైన సరుకులు నిల్వ ఉంచేలా చూసుకోవాలన్నారు.పారిశుధ్యం బాగుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి పథకాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా జగన్ సూచించారు. కరెంటు సరఫరాకు అంతరాయం వచ్చిన నేపథ్యంలో అత్యవసర సర్వీసులు నడిచేందుకు వీలుగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోమన్నారు.
తాగునీటికోసం ట్యాంకర్లను సిద్ధంచేసుకోవాలన్నారు.శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రతమత్తంగా ఉండమని కూడా కోరారు. చెరువులు, ఇరిగేషన్‌కాల్వలు.. ఎక్కడ బలహీనంగా ఉన్నాయో.. అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోమన్నారు. విద్యుత్ సబ్‌స్టేషన్లు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోమని కోరారు. బోట్లు, లైఫ్ జాకెట్లు.. అవసరైన ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచమని సీఎం సూచించారు.

4 జిల్లాలకు రూ.8 కోట్ల సాయం
రాష్ట్రంలో వర్షాలు, వరదల బారిన పడిన అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2కోట్ల చొప్పున తక్షణ నిధులు ఇస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. మొత్తం మీద నాలుగు జిల్లాలకు రూ.8 కోట్ల తక్షణ సాయం ప్రకటించారు. దీంతో పాటు సీఎంఓ అధికారులు మీకు అందుబాటులో ఉంటారన్నారు. వరద కారణంగా జరిగిన నష్టాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి రోజువారీ నివేదికలు పంపమని కలెక్టర్లకు సీఎం వైయస్.జగన్ నిర్ధేశించారు.
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565











Click it and Unblock the Notifications