ఆ ధైర్యం ఉందా: బాబుకు జగన్ సవాల్ (పిక్చర్స్)
అనంతపురం: ఏపీలో నెలకొన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతామని ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం అన్నారు. భరోసా యాత్రలో భాగంగా డీ హీరేహళ్ మండలంలో ఆయన భరోసా యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
అమలు కాని హామీలు ఇచ్చి రాష్ట్రంలోని రైతులు, మహిళా సంఘాలు సభ్యులను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మోసం చేశారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తారనే ఆశతో అన్నదాతలు రుణాలు చెల్లించకపోవడంతో ప్రస్తుతం 14 శాతం వడ్డీ కట్టాల్సి వస్తోందన్నారు.
రుణమాఫీ విషయంలో రైతులు, మహిళా సంఘాల సభ్యులు కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మహత్య చేసుకున్న రైతు ఆంజేనేయులు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

చంద్రబాబు
మంది మార్బలం లేకుండా పచ్చ చొక్కా నాయకులతో కలిసి గ్రామాలకు వచ్చే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని జగన్ సవాల్ విసిరారు. జగన్ సోమవారం డి.హీరేహల్, సోములాపురం, హడిగిలి, కాదలూరు గ్రామాల్లో జగన్ పర్యటించారు. కాదలూరు గ్రామంలో రైతులు, డ్వాక్రా మహిళలతో ముఖాముఖి నిర్వహించారు.

చంద్రబాబు
మతి చెదిరి గతి తప్పిన చంద్రబాబుకు బుద్ది మందగించి ఇచ్చిన హామీలు మరిచే జబ్బు చేసిందన్నారు. ఎలాంటి షరతులు లేకుండా అన్నదాతల పంటరుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి నేడు మాటమార్చారన్నారు.

చంద్రబాబు
రాష్ట్రంలో రూ. 87 వేల కోట్లు పంటరుణాల బకాయిలున్నాయని, దీనికి గడిచిన సంవత్సరానికి రూ.1,400 కోట్ల వడ్డీ భారం రైతుపై పడిందన్నారు.

చంద్రబాబు
బాబు పాలనలో హంద్రీనీవా ప్రాజెక్టు పనులకు రూ. 13 కోట్లు విడుదల చేశారన్నారు. వైయస్ అధికారం చేపట్టిన వెంటనే అనంత రైతులను ఆదుకునేందుకు హంద్రీనీవాకు రూ.5,800 కోట్లు విడుదల చేశారన్నారు. గత బడ్జెట్‌లో తెలుగుదేశం ప్రభుత్వం రూ.220 కోట్లు కేటాయించిందన్నారు.












Click it and Unblock the Notifications