అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'అనంత'లో ఆరో రోజుకు జగన్ యాత్ర: ' ప్రజలను మోసగించడంలో చంద్రబాబు దిట్ట'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో ఆరో రోజుకు చేరింది. యాత్రంలో భాగంగా సోమవారం కొడిమిలో చేనేత కార్మికుడు రామాంజనేయులు, నరసనాయనకుంటలో రైతు లక్ష్మానాయక్ కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు.

మామిళ్లపల్లిలో జగన్‌కు ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. రైతు భరోసా యాత్రకు ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, పార్టీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి, శంకర్ నారాయణలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథ్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజలను మోసగించడంలో చంద్రబాబు ఆరితేరారు: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

ys jagan rythu bharosa yatra at anantapur reaches sixth day

ప్రజలను మోసగించడంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆరితేరారని వైసీపీ శాసన మండలి పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. సోమవారం చింతలపూడిలో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాల పేరుతో రూ.1800 కోట్లు బూడిదలో పోసిన పన్నీరైందన్నారు.

గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోయిన ఘటనపై విచారణ ఏమైందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పార్టీ కార్యలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడుతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు హాజరైయ్యారు.

English summary
ys jagan rythu bharosa yatra at anantapur reaches sixth day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X