అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'పెద్దాయన' కోసం వైఎస్ జగన్ ప్రయత్నం?

|
Google Oneindia TeluguNews

వచ్చే ఎన్నికలు వైసీపీ, తెలుగుదేశం మధ్య హోరాహోరీగా జరగబోతున్నాయని ప్రస్తుత రాజకీయ వాతావరణం స్పష్టం చేస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల టీం సిద్ధమైందని, ఎప్పుడు ఎన్నికల ప్రకటన వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.

కర్నూలు జిల్లా నేత కోసం..

కర్నూలు జిల్లా నేత కోసం..


కర్నూలు జిల్లాలోని ఓ తెలుగుదేశం పార్టీ నాయకుణ్ని వైసీపీలో చేర్చుకోవడం కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ బలంగా ఉన్నప్పటికీ ఏ మాత్రం అలసత్వం వహించకూడదని, నిర్లక్ష్యం చేయకుండా పార్టీని గెలుపుబాటలో పయనింపచేయాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ వివిధ సంస్థలతో సీఎం ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహింపచేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యర్థి పార్టీకి బలంగా ఉన్న నేతలను తనవైపు తిప్పుకోవాలని యోచిస్తున్నారు.

 టీడీపీని దెబ్బతీయడానికి..

టీడీపీని దెబ్బతీయడానికి..

తెలుగుదేశం పార్టీకి అంగబలం, అర్థబలం రెండూ ఆ నాయకుడే కావడంతో అతన్ని పార్టీలో చేర్చుకోవడంద్వారా టీడీపీని అన్నిరకాలుగా దెబ్బతీయొచ్చని జగన్ అంచనా వేస్తున్నారు. జిల్లాలోని మిగతా అభ్యర్థులకు కూడా ఆర్థిక బలాన్ని అందజేస్తున్న వ్యక్తి కావడంతో పాటు రానున్న ఎన్నికల్లో ఆ నేతకు విజయావకాశాలున్నాయని సర్వేలో తేలింది. టీడీపీని గెలిపించగల శక్తిసామర్థ్యాలు ఉన్నాయికాబట్టి అతన్ని పార్టీలోకి తీసుకోవడానికి అన్నిరకాలుగా ప్రయత్నాలు ప్రారంభించారు.

ఇంకా సమాధానం ఇవ్వని నేత

ఇంకా సమాధానం ఇవ్వని నేత


ఇప్పటికే ఆయనతో చర్చలు జరిగాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కూడా తనకు గౌరవ భావమే ఉందని, ఎటువంటి అసంతృప్తి లేదని మధ్యవర్తులతో చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ నాయకుడు వైసీపీలోకి వస్తే జిల్లాలో పార్టీకి భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని జగన్ భావిస్తున్నారు. అనేకరకాలుగా, పలువురు నేతలతో మాట్లాడిస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర పెద్దలద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

English summary
Chief Minister Jagan is trying to induct a Telugu Desam Party leader from Kurnool district into YCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X