వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కోసం యువకుడి అరుదైన ప్రయత్నం-కశ్మీర్ నుంచి కన్యాకుమారి సైకిల్ యాత్ర

|
Google Oneindia TeluguNews

ఏపీలో సీఎం వైఎస్ జగన్ పై అభిమానం పొంగి పొరలుతొంది. సీఎం కాకముందు నుంచే వైఎస్ జగన్ కు అభిమానులుగా మారిన వారు కొందరైతే సీఎం అయ్యాక అభిమానులుగా మారుతున్న వారు మరికొందరు. ఇదే క్రమంలో తాజాగా ఆయనకు స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేలే గుళ్లు కూడా కట్టేస్తున్నారు. అదే బాటలో గతంలో జగన్ సీఎం అయితే జగన్ లాగే తాను కూడా పాదయాత్ర చేస్తానని ఓ యువకుడు మొక్కుకున్నాడు. జగన్ సీఎం కావడంతో పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. కానీ కరోనా రావడంతో ఈ యాత్ర వాయిదా పడింది. ఇఫ్పుడు కరోనా తగ్గడంతో తిరిగి యాత్ర కొనసాగుతోంది.

2019 లో జగన్ ముఖ్యమంత్రి అయితే పాదయాత్ర చేపడనామని పాదయాత్ర లో తూర్పు గోదావరి జిల్లా కు చెందిన పడాల రమేష్ అనే యువకుడు జగన్ కు తెలిపాడు. ఆ మేరకు జగన్ సీఎం కాగానే సైకిల్ యాత్ర ప్రారంభించాడు. కరోనా కారణంగా యాత్ర కొన్ని రోజులు ఆగింది. ఇప్పుడు తిరిగి ఈనెల 2వతేదీన తన యాత్రను రమేష్ పునః ప్రారంభించాడు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రమేష్ చేపట్టిన యాత్ర ఇవాళ ఆంధ్రప్రదేశ్ చేరుకుంది.

ys jagans fan cycle tour from kashmir to kanyakumari reaches andhrapradesh today

ఆంధ్రప్రదేశ్ లోకి సైకిల్ యాత్ర ద్వారా ప్రవేశించిన రమేష్ కు.. కృష్ణాజిల్లా నందిగామలో వైసీపీ నేతలు ఆపి సన్మానించారు.
ఈనెల 22 వ తేదీతో కన్యాకుమారి చేరుకుని రమేష్ సైకిల్ యాత్రను ముగించబోతున్నాడు. రోజుకు 150 కిలోమీటర్ల మేర సైకిల్ తోక్కుతూ రమేష్ యాత్ర సాగిస్తున్నాడు. దీంతో వైసీపీ నేతలు రమేష్ పట్టుదలను చూసి ఆశ్చర్య పోతున్నారు. ఏపీలో ప్రవేశించిన నేపథ్యంలో రమేష్ కు అభినందనలు తెలిపారు. త్వరలో యాత్ర ముగిశాక తిరిగి ఏపీ వచ్చి వైసీపీ నేతల్ని కలవాలని, వీలైతే సీఎం జగన్ ను కలుస్తానని అతను చెప్తున్నాడు.

ఓవైపు వైసీపీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, బియ్యపు మధుసూధన్ రెడ్డి వంటి వారు జగన్ కు గుళ్లు కడుతుంటే.. మరోవైపు రమేష్ వంటి వారు సైకిల్ యాత్రలు చేస్తూ జనాన్ని ఆకర్షిస్తున్నారు. తద్వారా జనంలోనూ వారికి పాపులారిటీ లభిస్తోంది. జగన్ కోసం వీరు చేస్తున్న ప్రయత్నాలను జనం కూడా ఆదరిస్తున్నారు.

English summary
ys jagan's fan who made cycle yatra from kashmir to kanyakumari reached andhrapradesh today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X