వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రాజధాని' హడావుడి వెనుక..: బాబుపై ఆధారాలు చూపిన రోజా!

By Srinivas
|
Google Oneindia TeluguNews

కర్నూలు: కృష్ణా, గోదావరి నదుల పైన తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వాటిని ప్రతిఘటించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని వైసిపి అధినేత చేస్తున్న దీక్ష బుధవారం మూడో రోజుకు చేరుకుంది. జగన్ దీక్షకు మంచి స్పందన లభిస్తోంది. దీనిని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలని దీక్ష చేపట్టారు. జగన్ కాలకృత్యాలు మినహా దీక్షా వేదిక పైనే ఉంటున్నారు.

మంగళవారం నాడు జగన్ దీక్షా ప్రాంగణానికి ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా తదితరులు వచ్చారు. ఈ సందర్భంగా రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు పైన నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డదారులు తొక్కి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి విజయం సాధించాలనుకున్న చంద్రబాబు కుయుక్తులను తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డుకున్నారన్నారు.

ఆందుకు సంబంధించిన పక్కా ఆడియో, వీడియో సాక్ష్యాలను సంపాదించి ఆపై చంద్రబాబుపై ఒత్తిడిని పెంచడం ద్వారా కేసీఆర్ బాబుబలి పార్ట్-1ను చూపించారని విమర్శించారు. దానికి భయపడే, చంద్రబాబు హైదరాబాద్ నుంచి మూట ముల్లె సర్దుకున్నారన్నారు.

పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ, హైదరాబాద్ అసెంబ్లీకి రావద్దని కేసీఆర్ చెప్పడంతోనే హడావుడిగా సచివాలయం నిర్మాణ పనులను వెలగపూడిలో చేపట్టారని విమర్శించారు. కేసీఆర్ ప్రాజెక్టులపై చంద్రబాబు ఒక్క విమర్శ చేసినా ఆయనకు బాబుబలి పార్ట్-2 కనిపిస్తుందన్నారు.

జగన్ దీక్ష

జగన్ దీక్ష

జగన్ జల దీక్ష రెండో రోజున రోజా చంద్రబాబు పైన నిప్పులు చెరిగారు. ఏ ముహుర్తాన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి కరువుతో బాధపడుతున్నామన్నారు.

జగన్ దీక్ష

జగన్ దీక్ష

చంద్రబాబు కృష్ణా జిల్లాకు వెళ్లారని, డెల్టా మొత్తం ఎడారిలా మారిందన్నారు. లింగమనేని గెస్ట్ హౌసులో ఉంటే ప్రకాశం బ్యారేజీ ఎండిపోయిందన్నారు.

జగన్ దీక్ష

జగన్ దీక్ష

చంద్రబాబు కర్నూలుకు వస్తే శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు అడుగంటి పోయాయని చెప్పారు. ఇంతటి తీవ్రమైన కరువును పట్టించుకోకుండా తన కుటుంబంతో విహారయాత్రకు వెళ్లడం విడ్డూరమన్నారు.

జగన్ దీక్ష

జగన్ దీక్ష

దర్శకులు రాజమౌళి మనకు బాహుబలి చూపిస్తే, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం చంద్రబాబుకు బాబుబలి పార్ట్ 1 చూపించారని రోజా ఎద్దేవా చేశారు.

జగన్ దీక్ష

జగన్ దీక్ష

ప్రధాని నరేంద్ర మోడీ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకోని చంద్రబాబు కేవలం ఐదు లక్షళ ఓట్లతోనే గెలుపొందారని రోజా అన్నారు

జగన్ దీక్ష

జగన్ దీక్ష

జగన్ పార్టీ పెట్టిన కొత్తలోనే ఎంపీగా ఆయన పోటీ చేస్తే 5.5 లక్షల మెజార్టీ వచ్చిందని రోజా చెప్పారు. చంద్రబాబులో రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే తమ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు.

జగన్ దీక్ష

జగన్ దీక్ష

చంద్రబాబు కృష్ణా జిల్లాకు వెళ్లే, డెల్టా మొత్తం ఎడారిలా మారిపోయిందని, లింగమనేని గెస్ట్‌హౌస్‌లో ఉంటే ప్రకాశం బ్యారేజి ఎండిపోయిందని, కర్నూలు వస్తే శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు అడుగంటిపోయాయని రోజా ఎద్దేవా చేశారు.

జగన్ దీక్ష

జగన్ దీక్ష

కరువుతో రాష్ట్రానికి రూ. 4 వేల కోట్ల నష్టం వస్తే కనీసం 400 కోట్లు కూడా తీసుకురాలేకపోయారని రోజా ధ్వజమెత్తారు. పశువులకు కూడా నీళ్లు లేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని, ఇలాంటి పరిస్థితిలో కూడా ఎగువన అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారని ఆమె అన్నారు.

English summary
YSRCP chief YS Jagan's Jala Deeksha enters day third, Roja slams Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X