ఆళ్లగడ్డలో మాట్లాడని జగన్! బాలుడి పరిస్థితి చూసి చలించారు, తమ్ముడికి ఆదేశాలు

తాను అధికారంలోకి రాగానే అందరి కష్టాలు తీరుస్తానని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం అన్నారు. గురువారం ఆయన పదోరోజు ప్రజా సంకల్ప యాత్ర ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైంది.

ఆళ్లగడ్డ: తాను అధికారంలోకి రాగానే అందరి కష్టాలు తీరుస్తానని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం అన్నారు. గురువారం ఆయన పదోరోజు ప్రజా సంకల్ప యాత్ర ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైంది.

Recommended Video

    YS Jagan public meeting in Allagadda ఆళ్లగడ్డలొ జగన్‌కు ఊహించని మద్దతు

     జగన్ ప్రజలతో మమేకం అయ్యారు

    జగన్ ప్రజలతో మమేకం అయ్యారు

    తన పదోరోజు పాదయాత్రలో జగన్ ఆళ్లగడ్డలో ఎక్కడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదు. ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. పాదయాత్ర ప్రారంభమైన కాసేపటికి సీపీఎస్ ఉద్యోగులు కలిసి తమ పాత పింఛను విధానం పునరుద్ధరించాలని కోరారు.

     ఏడాది ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది

    ఏడాది ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది

    ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అందరినీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఏడాది ఓపిక పడితే వైసీపీ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అందరి కష్టాలు తీరుతాయని వ్యాఖ్యానించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరిత, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

     వైద్యుడికి చికిత్స అందించాలని ఆదేశించిన జగన్

    వైద్యుడికి చికిత్స అందించాలని ఆదేశించిన జగన్

    పాదయాత్ర సందర్భంగా దొర్నిపాడు మండలం భాగ్యనగర్ వద్ద జగన్‌ను ఓ కుటుంబం కలిసి తమ ఆవేదన చెప్పుకుంది. తమ కుమారుడు సందీప్ వయస్సు ఆరేళ్లని, ఆయన మాట్లాడటం లేదని, ఇప్పటి వరకు రూ.7 లక్షల ఖర్చు పెట్టామని, ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్నారని, ఎమ్మెల్యేను కలిసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చలించిన జగన్.. తన సోదరుడు వైయస్ కొండారెడ్డిని పిలిచి బాలుడికి వైద్యం చేయించే ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు.

     కోర్టుకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌కు

    కోర్టుకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌కు

    దొర్నిపాడులో గురువారం సాయంత్రం జగన్ తన పాదయాత్రను ముగించుకున్నారు. అనంతరం హైదరాబాద్ బయలుదేరారు. శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒకరోజు విరామం తీసుకుంటున్నారు.

     జగన్‌ను చూసేందుకు జనం

    జగన్‌ను చూసేందుకు జనం

    కాగా, జగన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. పెద్దచింతకుంటకు జగన్ వస్తున్నారని తెలిసి కూలీలు ఆయనను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. చాలామంది మహిళలు తరలి వచ్చారు. బస్సులో వెళ్తున్న మహిళ జగన్‌ను చూసి కరచాలనం చేసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+