రేపు, ఎల్లుండి మోడీ వైజాగ్ టూర్- సీఎం జగన్ షెడ్యూల్ ఇదే- ఏయూ బహిరంగ సభే కీలకం !

ప్రధాని మోడీ రేపు, ఎల్లుండి విశాఖలో పర్యటించబోతున్నారు. రేపు సాయంత్రం విశాఖకు వచ్చే ప్రధానిని కలిసేందుకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరివెళ్లనున్నారు. అలాగే ఎల్లుండి మధ్యాహ్నం అక్కడి నుంచి తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ఈ మధ్యలో సీఎం జగన్ టూర్ కు సంబంధించి సీఎంవో షెడ్యూల్ విడుదల చేసింది.

సీఎం జగన్ వైజాగ్ లో ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పలు అభివృద్ది, శంకుస్ధాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఇందుకోసం రేపు(శుక్రవారం) సాయంత్రం 5.05 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. 6.15 గంటలకు విశాఖ చేరుకున్న తర్వాత సీఎం జగన్ .. 6.35 గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుని ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం ప్రధాని మోడీ రోడ్ షో ఉంటుంది. అయితే సీఎం జగన్ మాత్రం ప్రధానికి స్వాగతం పలికాక అక్కడి నుంచి వెళ్లిపోయి రాత్రికి పోర్ట్‌ గెస్ట్‌హౌస్‌లో బసచేస్తారు.

ys jagans schedule in pm modis vizag tour released-here are details

తిరిగి సీఎం జగన్ ఎల్లుండి శనివారం ఉదయం 10.05 గంటలకు ఏయూ గ్రౌండ్‌లోని హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. ఉదయం 10.20 గంటలకు ప్రధాని నరేంద్రమోదీకి అక్కడ స్వాగతం పలుకుతారు. ఉదయం 10.30- 11.45 గంటల మధ్య సీఎం జగన్ ప్రధాని మోడీతో కలిసి పలు శంకుస్ధాపనలు, ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవాలలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు తిరిగి జగన్ ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుని ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. 12.45 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. అక్కడితో సీఎం టూర్ ముగియనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+