హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీతో బాబు గుసగుస: జగన్‌కు కోపమొచ్చె(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తనది కాంగ్రెసు డిఎన్ఏ అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిగ్గీ వ్యాఖ్యలపై ఏం చెబుతారని విలేకరులు ప్రశ్నిస్తే.. ఆయన చెంపపై లాగిపెట్టి కొట్టండని జగన్ ధ్వజమెత్తారు. ఈ సమయంలో ఆయన ఆగ్రహోద్రులయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అసెంబ్లీ తీర్మానం ఒక్కటే పరిష్కారమన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భోపాల్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఆయన బిజెపి ముఖ్యనేతలతో పొత్తులపై చర్చించినట్లుగా సమాచారం.

మరోవైపు తెలంగాణ బిల్లుకు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అడ్డుతగులుతున్నాయని ఆరోపిస్తూ తెలంగాణ న్యాయవాదులు ఆ పార్టీల జెండాలను తగులబెట్టారు. అసెంబ్లీ వద్దకు శనివారం మధ్యాహ్నం చేరుకున్న లాయర్లు జెండాలను తగులబెట్టి ఆ పార్టీలకు, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విడుదల చేశారు.

జగన్ 1

జగన్ 1

"సమైక్యం అనని చంద్రబాబు నాయుడు, సమైక్యమంటూనే విభజనకు సహకరిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి మాటలను ఎమ్మెల్యేలు వినొద్దు. చంద్రబాబు, కిరణ్ చెప్పినట్లు వినకుండా ఆత్మ ప్రభోదానుసారం ఓటేసి రాష్ట్రాన్ని కాపాడండి'' అని టిడిపి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జగన్ విజ్ఞప్తి చేశారు.

జగన్ 2

జగన్ 2

తనది కాంగ్రెస్ డిఎన్ఏ అన్న ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ని చాచి చెంప మీద కొట్టండంటూ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

జగన్ 3

జగన్ 3

సమైక్యానికి కట్టుబడి ఉన్నానని చెబుతున్న కిరణ్ యుద్ధ విమానంలో వచ్చిన ముసాయిదా బిల్లును కేవలం 17 గంటల్లో అన్ని శాఖలకు పంపి అసెంబ్లీకి వచ్చేలా చేశారని జగన్ విమర్శించారు.

జగన్ 4

జగన్ 4

జూలై 30న కాళ్ల కిందికి, జివోఎం ఏర్పాటుతో మోకాళ్ల వద్దకు నీరొస్తే... నేను చూసుకుంటానంటూ ఉద్యోగులతో సమ్మె విరమింపజేసిన కిరణ్ సమైక్యానికి ద్రోహం చేస్తూ లోలోపల దిగ్విజయ్ చెప్పినట్లు విభజనకు సహకరిస్తున్నారని జగన్ మండిపడ్డారు.

జగన్ 5

జగన్ 5

జాతికి ద్రోహం చేసి చరిత్ర పుటల్లో నిలిచిపోనున్న కిరణ్ మాటలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నమ్మొద్దని, చంద్రబాబు సమైక్యం అని ఒక్కమాట అనకుండా వారం రోజులుగా ట్యూషన్ చెప్పినట్లు ప్రెస్‌మీట్లు పెడుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు.

జగన్ 6

జగన్ 6

అసెంబ్లీలో వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపితే విభజన ఆగిపోతుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేది లేదన్నారు.

బాబు 1

బాబు 1

మూడోసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.

బాబు 2

బాబు 2

మూడోసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. వేదికపై మోడీ పక్కన బాబు

బాబు 3

బాబు 3

మూడోసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. వేదికపై మోడీ పక్కన బాబు. నేతల మంతనాలు.

బాబు 4

బాబు 4

మూడోసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.

హైదరాబాద్ 1

హైదరాబాద్ 1

తెలంగాణ బిల్లుకు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అడ్డుతగులుతున్నాయని ఆరోపిస్తూ తెలంగాణ న్యాయవాదులు ఆ పార్టీల జెండాలను తగులబెట్టారు.

హైదరాబాద్ 2

హైదరాబాద్ 2

తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అడ్డుతగులుతున్నాయని ఆరోపిస్తూ తెలంగాణ న్యాయవాదులు ఆ పార్టీల జెండాలను తగులబెట్టారు. న్యాయవాదిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు.

హైదరాబాద్ 3

హైదరాబాద్ 3

తెలంగాణ బిల్లుకు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అడ్డుతగులుతున్నాయని ఆరోపిస్తూ తెలంగాణ న్యాయవాదులు ఆ పార్టీల జెండాలను తగులబెట్టారు.

హైదరాబాద్ 4

హైదరాబాద్ 4

తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అడ్డుతగులుతున్నాయని ఆరోపిస్తూ తెలంగాణ న్యాయవాదులు ఆ పార్టీల జెండాలను తగులబెట్టారు. న్యాయవాదిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు.

హైదరాబాద్

హైదరాబాద్

అసెంబ్లీ వద్దకు శనివారం మధ్యాహ్నం చేరుకున్న లాయర్లు టిడిపి, జగన్ పార్టీ జెండాలను తగులబెట్టి ఆ పార్టీలకు, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy saying only option left is for the Assembly is to pass a resolution to keep state United.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X