దీదీతో భేటీకి కోర్టు అనుమతి కోరిన వైయస్ జగన్
హైదరాబాద్: కోల్‌కతా పర్యటనకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణను కోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తాను కలవాల్సి ఉందని చెబుతూ అందుకు అనుమతించాలని జగన్ కోర్టును కోరారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు సిబిఐ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించడానికి తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న తర్వాత జగన్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.

సమైక్యవాదానికి వివిధ రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టడానికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాలని జగన్ అనుకున్నారు. అందుకు అనుమతి కోరుతూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించడానికి అనుమతి కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సిబిఐ తన వాదనలను కోర్టుకు వినిపించింది. సిబిఐ వాదనతో కోర్టు ఏకీభవించింది.
ఇదిలావుంటే,త అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసు విచారణలో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మంత్రి గీతా రెడ్డి హాజరు కాలేదు. రాష్ట్ర విభజనపై ఢిల్లీకి వెళ్లినందున కోర్టుకు హాజరు కాలేదని గీతా రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టులో విచారణ నిమిత్తం ధర్మాన ఢిల్లీ వెళ్లినట్లు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.












Click it and Unblock the Notifications